Desamuduru : అల్లు అర్జున్ దేశముదురు 4కే ట్రైలర్ అదరగొడుతోందిగా..
ది మోస్ట్ అవేటింగ్ రీ రిలీజింగ్ ఫిల్మ్ దేశముదురు 4k ట్రైలర్ తాజాగా రిలీజైపోయింది. బన్నీ ఫ్యాన్స్ అందర్నీ అరిపించేస్తోంది. యూట్యూబ్లో సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది.
ఓ పక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్న వేళ.. బన్నీ ఫ్యాన్స్‌లో మాత్రం ఒకటే టెన్షన్. అసుల బన్నీ దేశముదురు సినిమా రీ రిలీజ్ అవుతుందా.. లేదా అన్నదే నిన్నమొన్నటి వరకు వారికున్న టెన్షన్. ఇక తాజాగా వారికున్న ఈ టెన్షనే ఇప్పుడు పట్టరానంత జోష్‌గా మారింది. ఎందుకంటే.. ది మోస్ట్ అవేటింగ్ రీ రిలీజింగ్ ఫిల్మ్ దేశముదురు 4k ట్రైలర్ తాజాగా రిలీజైపోయింది. బన్నీ ఫ్యాన్స్ అందర్నీ అరిపించేస్తోంది. యూట్యూబ్లో సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది.
పూరీ డైరెక్షన్లో.. బన్నీ చేసిన సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ దేశ ముదురు. అయితే ఈ సినిమాను బన్నీ బర్త్ డే ఏప్రిల్ 17న మరో సారి రీ రిలీజ్ చేయాలని ఆయన ఫ్యాన్స్ అందరూ డిమాండ్ చేశారు. ఈ మూవీ ప్రొడ్యూసర్‌ను వేడుకున్నారు. ఇక దీనికి ఓకే అన్న ప్రొడ్యూసర్ దానయ్య.. తాజాగా ఈ మూవీని రీ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. 4k ప్రాసెసింగ్ అంతా చేయించేశారు.
అంతేకాదు.. తాజాగా ఈ మూవీ 4k ట్రైలర్ ను కూడా అఫీషియల్‌గా రిలీజ్ చేశారు దానయ్య. దాంతో పాటే.. ఈ మూవీని 6th ఏప్రిల్ తెలుగు టూ స్టేట్స్‌లో.. 7th ఏప్రిల్ బన్నీకి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కేరళలో… 8th ఏప్రిల్ తమిళ నాడు కర్ణాటకలోని కొన్ని థియేటర్లలోనూ రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని అఫీషియల్ గా.. తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేశారు దానయ్య.