AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఎవరు’ అదిరిపోయింది శేష్ : అల్లు అర్జున్

అడివి శేష్‌, రెజీనా, నవీన్‌ చంద్ర లీడ్ రోల్స్‌లో నటించిన  థ్రిల్ల‌ర్ చిత్రం ‘ఎవరు’. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి అప్లాజ్ అందుకుంటోంది. తాజాగా ఈ సినిమాను చూసిన స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మూవీ యూనిట్‌కి  అభినందనలు తెలిపారు. ‘‘ఎవరు’ చిత్ర బృందానికి అభినందనలు..  నిన్న రాత్రే సినిమా చూశాను. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఊహించని మలుపులు, ట్విస్టులలతో సాగిన అద్భుతమైన మర్డర్ మిస్టరీ ఈ చిత్రం. సినిమా బాగా […]

‘ఎవరు’ అదిరిపోయింది శేష్ : అల్లు అర్జున్
Allu Arjun Showers Appreciations On Evaru
Ram Naramaneni
|

Updated on: Aug 19, 2019 | 1:59 PM

Share

అడివి శేష్‌, రెజీనా, నవీన్‌ చంద్ర లీడ్ రోల్స్‌లో నటించిన  థ్రిల్ల‌ర్ చిత్రం ‘ఎవరు’. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి అప్లాజ్ అందుకుంటోంది. తాజాగా ఈ సినిమాను చూసిన స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మూవీ యూనిట్‌కి  అభినందనలు తెలిపారు.

‘‘ఎవరు’ చిత్ర బృందానికి అభినందనలు..  నిన్న రాత్రే సినిమా చూశాను. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఊహించని మలుపులు, ట్విస్టులలతో సాగిన అద్భుతమైన మర్డర్ మిస్టరీ ఈ చిత్రం. సినిమా బాగా నచ్చింది. కథ, సాంకేతికత చాలా బాగుంది. రెజీనా, అడివి శేష్‌ చాలా బాగా నటించారు. చిత్రబృందానికి అభినందనలు.’ అంటూ ట్వీట్‌ చేశారు.  వెంకట్‌ రామ్‌జీ  ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పీవీపీ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.

అల్లు అర్జున్ ట్వీట్‌కు అడివి శేష్ స్పందించారు. బన్నీ తనను ప్రోత్సహిస్తున్న తీరుపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ప్రియతమ సోదరుడు అల్లు అర్జున్, మీ ప్రోత్సాహంతో ‘క్షణం’ సినిమాను లక్షలాది మంది ప్రజలకు చేరువయ్యేలా చేశారు. మళ్లీ ఇప్పుడు ‘ఎవరు’ సినిమాను సపోర్ట్ చేశారు. మీ ప్రోత్సాహం కారణంగా మా సినిమా ఇప్పుడు మీ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది ప్రేక్షకులకు చేరువవుతుంది. ఒక సోదరుడిలా నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు’’ అని అడివి శేష్ ట్వీట్ చేశారు.