Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: అల్లు అర్జున్ అభిమానులకు షాక్.. అక్కడ జాతర ఎపిసోడ్ కట్

అల్లు అర్జున్ , రష్మిక మందన్న 'పుష్ప 2' బిగ్ స్క్రీన్‌పై విడుదలైంది. సౌత్ నుంచి హిందీ సినిమా వరకు ప్రేక్షకులు ఈ సినిమాని చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'పుష్ప 2'కి దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి ఆదరణ ఉంది.

Pushpa 2: అల్లు అర్జున్ అభిమానులకు షాక్.. అక్కడ జాతర ఎపిసోడ్ కట్
పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడొస్తుందో తెలియదు కానీ.. ఆల్రెడీ థియేటర్స్‌లో అల్లు అర్జున్ ర్యాంపేజ్ అయితే మొదలైపోయింది. ప్రీమియర్స్ నుంచే పూనకాలు పుట్టిస్తున్నాడు పుష్ప రాజ్.
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 05, 2024 | 8:47 AM

‘పుష్ప 2’ గురించి దేశ విదేశాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇండియాలో ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో, విదేశాల్లో కూడా అంతే ఆత్రుతతో ‘పుష్ప 2’ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు నిరీక్షణకు తెరపడి ‘పుష్ప 2’ థియేటర్లలోకి వచ్చింది. ‘పుష్ప 2’ చూసేందుకు అభిమానులు ఇప్పటికే థియేటర్స్ కు భారీగా చేరుకుంటున్నారు. అయితే ఇంతలో అల్లు అర్జున్ ‘పుష్ప 2’గురించి ఓ షాకింగ్ విషయం వైరల్ అవుతుంది.

ఇండియాలో ‘పుష్ప 2’  రమ్ టైమ్ వ్యవధి దాదాపు 3. 20 నిమిషాలు ఉంది, అయితే సౌదీ అరేబియాలో రన్ టైం ను తగ్గించారని తెలుస్తోంది. సౌదీ అరేబియా సెన్సార్ బోర్డు జాతర ఎపిసోడ్‌ను కట్ చేసిందని తెలుస్తోంది. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రాన్ని సౌదీ అరేబియా సెన్సార్ బోర్డు 19 నిమిషాలు కట్ చేసింది. ఇప్పుడు 3 గంటల 1 నిమిషం నిడివిగల ఈ చిత్రం సౌదీ అరేబియాలో విడుదలైంది. ‘పుష్ప 2’లో కొన్ని కట్స్ తర్వాత అక్కడ విడుదలకు అనుమతించారు.

అయితే సౌదీ అరేబియా సెన్సార్ బోర్డు ఏ బాలీవుడ్ సినిమా అయినా నచ్చకపోతే బ్యాన్ చేస్తుంది. కానీ ‘పుష్ప 2’ క్రేజ్ ఎంతగా ఉందంటే అక్కడ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.. అల్లు అర్జున్ కు,  ‘పుష్ప సినిమాకు విదేశాలలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. గత కొన్ని నెలలుగా, అభిమానులు ఈ చిత్రాన్ని చూడటానికి టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి వేచి ఉన్నారు. అల్లు అర్జున్ సినిమా తొలిరోజే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని తెచ్చిపెడుతుందని ‘పుష్ప 2’  అంచనా వేస్తున్నారు. ఈ సినిమా తొలిరోజు వసూళ్లు భారీ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. థియేటర్స్ దగ్గర ఇప్పటికే జాతర హడావిడి కనిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.