Allu Arjun Birthday: ‘పార్టీ లేదా పుష్ప..’ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోన్న ఎన్టీఆర్‌ ట్వీట్‌

|

Apr 09, 2023 | 8:27 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప సినిమా తర్వాత బన్నీ ఇమేజ్‌ దేశాంతరాలనూ దాటింది. తాజాగా విడుదలైన పుష్ప-2 టీజర్‌ సోషల్‌ మీడియాను ఓ ఊపు ఊపేసింది. ఇక ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సినిమాపై ఎక్కడలేని హైప్‌ క్రియేట్‌ చేసింది..

Allu Arjun Birthday: పార్టీ లేదా పుష్ప.. సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోన్న ఎన్టీఆర్‌ ట్వీట్‌
NTR Birthday Wishes to Allu Arjun
Follow us on

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప సినిమా తర్వాత బన్నీ ఇమేజ్‌ దేశాంతరాలనూ దాటింది. తాజాగా విడుదలైన పుష్ప-2 టీజర్‌ సోషల్‌ మీడియాను ఓ ఊపు ఊపేసింది. ఇక ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సినిమాపై ఎక్కడలేని హైప్‌ క్రియేట్‌ చేసింది. బన్నీకి టాలీవుడ్‌, బాలీవుడ్‌తోపాటు క్రికెటర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ శుభాకాంక్షలు తెలుపుతూ పెట్టిన ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

‘హ్యాపీ బర్త్‌డే బావా’.. అంటూ ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. బన్నీ రిప్లై ఇస్తూ ‘థ్యాంక్యూ ఫర్‌ యువర్‌ లవ్లీ విషెస్‌.. వామ్‌ హగ్స్‌’ అంటూ రీ ట్వీట్‌ చేశారు. ఓన్లీ హగ్స్‌..పార్టీ లేదా పుష్ప? అంటూ ట్వీట్‌ చేయడంతోపాటు నవ్వుతున్న ఎమోజీని పోస్టు పెట్టారు. ఇక బన్నీ కూడా తారక్‌ స్టైల్‌లో ‘వస్తున్నా!!’ అంటూ ఎన్టీఆర్‌ 30 డైలాగ్‌తో సరదాగా బన్నీ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి వాట్సప్‌ సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టాలీవుడ్‌ అగ్రనటులిద్దరరూ ఇంత క్లోజ్‌గా చాట్ చేసుకోవడంతో.. అటు మెగా బన్నీ ఫ్యాన్స్‌ను, ఇటు తారక్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంది. వీరి కన్వర్‌జేషన్‌లో ‘బావా..’ అంటూ ఒకరినొకరు పిలుచుకోవడం ఇద్దరి మధ్య ఉన్న చనువును తెలుపుతోంది. నిజానికి అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లు బంధువులు కాకపోయినా వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్‌. ఎన్టీఆర్‌కు చరణ్‌ కంటే ముందు నుంచే బన్నీతో ఫ్రెండ్‌షిప్‌ ఉంది. ఎక్కడ కలుసుకున్న, ఎప్పుడు చాట్‌ చేసుకున్న బావా అనుకుంటూనే మాట్లాడుకుంటారు.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికొస్తే పుష్ప సీక్వెల్‌తో అల్లు అర్జున్‌ బిజీగా ఉన్నాడు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సమ్మర్‌ కానుకుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అటు తారక్‌ కూడా ఎన్టీఆర్‌30 ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.