ఊహించ‌ని ధరకు ‘లక్ష్మీబాంబ్’ ఓటీటీ రైట్స్..!

కిలాడీ హీరో అక్షయ్ కుమార్ ప్ర‌స్తుత క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో ఎన్నో డొనేష‌న్స్ ఇచ్చి త‌న మంచి మన‌సు చాటుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. తాజాగా ఈ హీరో నటించిన హారర్ కామెడీ ‘లక్ష్మీబాంబ్’.. త్వరలో హాట్​స్టార్​లో డైరెక్ట్ గా రిలీజ్ అవ్వ‌నుంది. ఈ విషయాన్ని ఓ వాణిజ్య సంస్థ క‌న్ఫామ్ చేసింది. మొద‌ట‌ చర్చలు విఫలమైనా, ఆ తర్వాత అగ్రిమెంట్ కుదిరిందని చెప్పింది. కొన్నిరోజుల్లో ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రానుందని స్పష్టం చేసింది. ఈ […]

ఊహించ‌ని ధరకు 'లక్ష్మీబాంబ్' ఓటీటీ రైట్స్..!

కిలాడీ హీరో అక్షయ్ కుమార్ ప్ర‌స్తుత క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో ఎన్నో డొనేష‌న్స్ ఇచ్చి త‌న మంచి మన‌సు చాటుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. తాజాగా ఈ హీరో నటించిన హారర్ కామెడీ ‘లక్ష్మీబాంబ్’.. త్వరలో హాట్​స్టార్​లో డైరెక్ట్ గా రిలీజ్ అవ్వ‌నుంది. ఈ విషయాన్ని ఓ వాణిజ్య సంస్థ క‌న్ఫామ్ చేసింది. మొద‌ట‌ చర్చలు విఫలమైనా, ఆ తర్వాత అగ్రిమెంట్ కుదిరిందని చెప్పింది. కొన్నిరోజుల్లో ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రానుందని స్పష్టం చేసింది.

ఈ మూవీని ముందుగా రూ.145 కోట్లకు ఓటీటీకి విక్రయించారని ఓ వార్త సంస్థ తెలిపింది. ఆ తర్వాత రూ. 125 కోట్లకు నిర్మాతలు, హాట్​స్టార్ మధ్య అగ్రిమెంట్ కుదిరిందని అదే సంస్థ‌ పేర్కొంది. థియేటర్లలో రిలీజై, వచ్చే కలెక్షన్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ మొత్త‌మ‌ని చెప్పుకొచ్చింది. ఈ విషయమే ప్రజంట్ బాలీవుడ్​ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే దీనికి సంబంధించి మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కియారా అద్వాణీ హీరోహీరోయిన్లుగా నటించారు. దక్షిణాది హిట్​ చిత్రం ‘కాంచన’ రీమేక్​గా ఈ ఫిల్మ్ రూపోందింది. మాతృకను తీసి హీరోగా న‌టించిన..మ‌ల్టీ టాలెంటెడ్ రాఘవ లారెన్స్ దీనికీ దర్శకత్వం వహించారు.