ఆర్థిక ఇబ్బందులు.. కారు అమ్మేశానన్న నటుడు..!

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వలన సినిమా, టీవీ షూటింగ్‌లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది కారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరైతే వేరే వారి దగ్గర నుంచి డబ్బులను అప్పుగా తీసుకుంటున్నారు. మరికొందరేమో ఇళ్లు గడవడం కోసం ఏదో ఒక పని చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో తాను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, అందుకే కారును అమ్మేశానని బుల్లితెర నటుడు మానస్‌ షా చెప్పుకొచ్చారు. ”నా […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:09 pm, Fri, 29 May 20
ఆర్థిక ఇబ్బందులు.. కారు అమ్మేశానన్న నటుడు..!

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వలన సినిమా, టీవీ షూటింగ్‌లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది కారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరైతే వేరే వారి దగ్గర నుంచి డబ్బులను అప్పుగా తీసుకుంటున్నారు. మరికొందరేమో ఇళ్లు గడవడం కోసం ఏదో ఒక పని చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో తాను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, అందుకే కారును అమ్మేశానని బుల్లితెర నటుడు మానస్‌ షా చెప్పుకొచ్చారు.

”నా జీవితంలో మొదటిసారిగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నా. ఇప్పుడు నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా. జీవించడం కోసం నా కారును అమ్మేయాల్సి వస్తుంది. అలాగే నేను నివాసం ఉంటున్న ఇంటిని వదిలి నా కజిన్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. గతేడాది మే 2 నుంచి నవంబర్ 5 వరకు నేను ఓ షో షూటింగ్‌లో పాల్గొన్నా. అందులో మే వరకు మాత్రమే మాకు అమౌంట్ పే చేశారు. అది కూడా సెప్టెంబర్‌లో ఇస్తామని అక్టోబర్‌లో ఇచ్చారు. ఆ తరువాత చేసిన పనికి డబ్బులు కూడా రాలేదు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఇంకా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మా నాన్న రిటైర్ ఉద్యోగి. కుటుంబ బాధ్యతలను కూడా నేనే చూసుకోవాలి” అని మానస్ చెప్పుకొచ్చారు. కాగా ఈ నటుడు ‘హమారీ దేవ్‌రాణీ’, ‘సంకట్‌మోచన్‌ మహాబలి హనుమాన్’ అనే సీరియల్స్‌లో నటించారు.

Read This Story Also: అనుచిత వ్యాఖ్యలు.. మరో 44 మందికి హైకోర్టు నోటీసులు..!