దేశానికి ఇలాంటి హీరోలే కావాల్సింది..సాయానికి ప‌ర్యాయ‌ప‌దం

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి దేశమంతా గుర్తు పెట్టుకోవాల్సిన అవ‌సరం ఉంది. ఎందుకంటే దేశం క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న స‌మ‌యంలో అక్ష‌య్ ప‌దే, ప‌దే సాయం చెయ్య‌డానికి ముందుకు వ‌స్తున్నారు. తాజాగా కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి ఫ్రంట్ లైన్ లో ఉండి విధులు నిర్వ‌ర్తిస్తోన్న‌ ముంబై పోలీసులకు అండగా నిలిచారు. క‌రోనా దేశాన్ని ముసిరిన‌ప్ప‌టినుంచి పలుమార్లు ఆర్థిక సహాయం, విరాళాలు ప్రకటించిన అక్షయ్..ఈసారి పోలీసుల ఆరోగ్యంపై ఫోక‌స్ పెట్టి హెల్త్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. […]

దేశానికి ఇలాంటి హీరోలే కావాల్సింది..సాయానికి ప‌ర్యాయ‌ప‌దం
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

May 15, 2020 | 3:54 PM

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి దేశమంతా గుర్తు పెట్టుకోవాల్సిన అవ‌సరం ఉంది. ఎందుకంటే దేశం క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న స‌మ‌యంలో అక్ష‌య్ ప‌దే, ప‌దే సాయం చెయ్య‌డానికి ముందుకు వ‌స్తున్నారు. తాజాగా కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి ఫ్రంట్ లైన్ లో ఉండి విధులు నిర్వ‌ర్తిస్తోన్న‌ ముంబై పోలీసులకు అండగా నిలిచారు. క‌రోనా దేశాన్ని ముసిరిన‌ప్ప‌టినుంచి పలుమార్లు ఆర్థిక సహాయం, విరాళాలు ప్రకటించిన అక్షయ్..ఈసారి పోలీసుల ఆరోగ్యంపై ఫోక‌స్ పెట్టి హెల్త్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. కోవిడ్-19 డ్యూటీలో ఉన్న పోలీసులకు వ్యాధి లక్షణాలను గుర్తించే హెల్త్ బ్యాండ్‌లను అందించారు. దీంతో తమ సమీపంలో మ‌హ‌మ్మారి వైర‌స్ బారిన పడిన వ్యక్తులను సులభంగా గుర్తించడానికి వీలు కలుగుతుంది.

మహారాష్ట్రను కరోనా వీర‌విహారం చేస్తున్న వేళ‌ ముంబై పోలీసులకు 1000 రిస్ట్ బ్యాండ్లను అందజేశారు. అక్ష‌య్ కార‌ణంగా ముంబై పోలీసులు ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇలా కరోనాను గుర్తించే అస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోని పోలీసులకు కూడా అందుబాటులో లేవు. కాగా అక్ష‌య్ ఇప్ప‌టికే పీఎం-కేర్స్ ఫండ్ కు రూ.25 కోట్ల విరాళం ప్రకటించిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా బొంబాయి మున్సిపాలిటీకి పలు కార్యక్రమాలకు విరాళం ప్రకటించారు. ఇలా ఇప్పుడు నెటిజ‌న్ల‌తో రియ‌ల్ హీరో అనిపించుకుంటున్నాడు అక్ష‌య్ కుమార్.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu