చిరు అన్నయ్య.. మీ ఏకలవ్య శిష్యుడిగా ఈ ‘లూజర్’ మీకు అంకితం

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వారిలో చాలా మందికి మెగాస్టార్ చిరంజీవి ఒక ఇన్ఫిరేషన్. ఆయన ఇన్ఫిరేషన్‌తో ఎంతోమంది ఇక్కడకు వచ్చి స్టార్ హీరోలుగా, మంచి నటులుగా మారారు.

చిరు అన్నయ్య.. మీ ఏకలవ్య శిష్యుడిగా ఈ 'లూజర్' మీకు అంకితం
Follow us

| Edited By:

Updated on: May 15, 2020 | 3:44 PM

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వారిలో చాలా మందికి మెగాస్టార్ చిరంజీవి ఒక ఇన్ఫిరేషన్. ఆయన ఇన్ఫిరేషన్‌తో ఎంతోమంది ఇక్కడకు వచ్చి స్టార్ హీరోలుగా, మంచి నటులుగా మారారు. వారిలో రవితేజ, లారెన్స్, నాని ఇలా చాలా మంది ఉండగా.. తాజాగా ప్రియదర్శి చేరారు. ‘పెళ్లిచూపులు’ సినిమా ద్వారా కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియదర్శి.. ఆ తరువాత పలు సినిమాల్లో కీలక పాత్రల్లోనూ, అలాగే ‘మల్లేశం’ సినిమాలో హీరోగానూ నటించారు. ఇక ఆ నటుడు తాజాగా ‘లూజర్’‌ అనే వెబ్‌సిరీస్‌లో నటించగా.. దానికి సంబంధించిన ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. అందులో ఓ సీన్‌లో ప్రియదర్శి బ్లాక్‌ బోర్డ్ వద్ద ఉండగా.. పైన ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్న లైన్‌ ఉంటుంది.

ఇక ఆ షాట్‌ను, చిరంజీవి స్వయం కృషిలోని ఓ షాట్‌ను పెట్టిన ప్రియదర్శి.. ”అన్నయ్య చిరంజీవి గారికి గురుభ్యోనమః ఇది పోలిక కానే కాదు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ మీ బాటలో నడిచి ఎంతో స్ఫూర్తి పొందాను. నటనలో ఆవిష్కరించిన ఎన్నో కొత్త విధానాలు నాపై ఎంత ప్రభావాన్ని చూపించాయో మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. అందుకే నేడు మీ ఏకలవ్య శిష్యుడిగా ఈ లూజర్ మీకు అంకితం” అని కామెంట్ పెట్టారు.

Read This Story Also: ఆ లిస్ట్‌లో నాలుగో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్..!