Akhanda 2 : అఖండ 2 మాస్ తాండవం టీజర్ రిలీజ్.. బాలయ్య ఉగ్రరూపం.. గూస్ బంప్స్ వీడియో..
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా అఖండ 2. డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా విడుదల కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు మేకర్స్.

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తోన్న మరో ప్రాజెక్ట్ అఖండ 2. మొదటి నుంచి ఈ మూవీ భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కోసం నందమూరి ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కొన్నాళ్ల క్రితం విడుదలైన టీజర్, ట్రైలర్ హైప్ క్రియేట్ చేయగా.. ఈ మూవీ విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్ 28 శుక్రవారం హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా విడుదలకు ముందు అఖండ 2 మాస్ తాండవం అంటూ టీజర్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి : Nani : నానితో జెర్సీ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? చివరకు ఆ హీరోతో బ్లాక్ బస్టర్..
తాజాగా విడుదలైన వీడియో నందమరి అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. “కొడండల్లో తొండలు పట్టుకుని తిని బతికే మీరక్కడ.. ప్రతి కొండను క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ” అంటూ వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇందులో బాలయ్య గెటప్, డైలాగ్స్, తమన్ బీజీఎమ్ మరింత హైలెట్ అవుతున్నాయి. మొత్తానికి ఈ సినిమాలో బాలయ్య ఉగ్రరూపం చూపించనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Prithviraj Sukumaran : ఏంటీ.. ఈ స్టార్ హీరో భార్య టాప్ జర్నలిస్టా.. ? ఫోన్ కాల్తో ప్రేమకథ.. లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు..
ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నాడు. మామూలుగా బోయపాటి, బాలయ్య, థమన్ కలయిక అంటే హై వోల్టేజ్ ఆడియో. ఈసారి కూడా పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి మరో హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Nani : నానితో జెర్సీ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? చివరకు ఆ హీరోతో బ్లాక్ బస్టర్..
ఇవి కూడా చదవండి : Tollywood : కుర్రాళ్లకు మెంటలెక్కించిన హీరోయిన్.. కట్ చేస్తే.. అవకాశాల కోసం ఎదురుచూపులు..
