Nagarjuna: ఆ సినిమా నాగార్జునలో మార్పు తెచ్చింది.. కింగ్ నాగార్జున బర్త్ డే స్పెషల్..

ఎన్నో చిత్రాలు.. అంతకుమించి మరెన్నో అవార్డులు కింగ్ సొంతం. శివ సినిమాతో ఆల్ టైమ్ బ్లాక్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా అటు నాగ్ కెరీర్.. ఇటు టాలీవుడ్ దిశను పూర్తిగా మార్చేసింది. ఇప్పటికీ శివ సినిమాకు యూత్ లో యమ క్రేజ్ ఉంది. 1989లో విడుదలైన ఈ సినిమా సరికొత్త ట్రెండ్ సృష్టించింది. శివ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. మూడు నంది అవార్డులు దక్కించుకుంది.

Nagarjuna: ఆ సినిమా నాగార్జునలో మార్పు తెచ్చింది.. కింగ్ నాగార్జున బర్త్ డే స్పెషల్..
Nagarjuna.jp
Follow us

|

Updated on: Aug 29, 2024 | 10:34 AM

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినీప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు నాగ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మాస్ చిత్రాన్ని రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఎన్నో ప్రయోగాలు చేసిన ఏకైన స్టార్ హీరో నాగ్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్నమైన సినిమాలు.. అనేక ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. సినీ పరిశ్రమలో చాలా మంది దర్శకులను పరిచయం చేశారు. ఏకంగా 40 మంది కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించారు. వైవిధ్యమైన పాత్రలకు జీవం పోశారు. ప్రతి పాత్రకు తనను తాను కొత్తగా మలుచుకుంటూ.. సినీరంగంలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఎన్నో చిత్రాలు.. అంతకుమించి మరెన్నో అవార్డులు కింగ్ సొంతం. శివ సినిమాతో ఆల్ టైమ్ బ్లాక్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా అటు నాగ్ కెరీర్.. ఇటు టాలీవుడ్ దిశను పూర్తిగా మార్చేసింది. ఇప్పటికీ శివ సినిమాకు యూత్ లో యమ క్రేజ్ ఉంది. 1989లో విడుదలైన ఈ సినిమా సరికొత్త ట్రెండ్ సృష్టించింది. శివ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. మూడు నంది అవార్డులు దక్కించుకుంది.

కేవలం మాస్ యాక్షన్ చిత్రాలు కాకుండా గోవిందా గోవిందా వంటి న్యాచురల్ హెయిస్ట్ ఫిల్మ్, నిన్నే పెళ్లడతా వంటి ఫ్యామిలీ డ్రామా, హలో బ్రదర్ లాంటి యాక్షన్ కామెడీతోపాటు భక్తిరస చిత్రాలను వెండితెరకు పరిచయం చేశారు. ముఖ్యంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన అన్నమయ్య సినిమాతో మరో కోణాన్ని పరిచయం చేశారు. అప్పటివరకు మాస్ హీరోగా కనిపించిన నాగార్జున.. అన్నమయ్య సినిమాతో సినీ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేశారు. 1997లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. రెండు జాతీయ పురస్కారాలు, తొమ్మిది నంది, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సాధించింది. ఈ సినిమాలో నటించిన తర్వాత వ్యక్తిగా తనలో ఎంతో పరిణితి వచ్చిందని నాగార్జున గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అన్నమయ్య తర్వాత శ్రీరామదాసు, శిరిడిసాయి, ఓం నమో వెంకటేశాయ వంటి ఆధ్యాత్మిక చిత్రాల్లో నటించారు.

తన సుధీర్ఘ నట ప్రస్థానంలో సుమారు 40 మంది దర్శకులను పరిచయం చేశారు. శివ సినిమాతో రామ్ గోపాల్ వర్మ.. శ్రీ సితారాముల కళ్యాణం చూతము రారండి మూవీతో వైవీఎస్ చౌదరి, మాస్ సినిమాతో లారెన్స్ వంటి దర్శకులను టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇక ఇటీవల నా సామిరంగ మూవీతో మరో కొత్త దర్శకుడు విజయ్ బిన్నీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. పరాజయాలను ఏమాత్రం పట్టించుకోకుండా కథ, దర్శకుడిపై నమ్మకంతో కొత్తవారికి అవకాశాలు కల్పించారు నాగార్జున. ప్రస్తుతం డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో కుబేర చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో కోలీవుడ్ హీరో ధనుష్, రష్మిక మందన్న కీలకపాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో