Tollywood: అయ్యా బాబోయ్.. ఆ యంగ్ హీరో ఇలా మారిపోయాడేంటీ..  ఎవరో గుర్తుపట్టారా..?

అంతేకాకుండా చాలాకాలంగా సైలెంట్ అయ్యాడు. అటు సోషల్ మీడియాలో ఇటు బయట కూడా కనిపించడం లేదు. కానీ ఇప్పుడు ఈ హీరో కొత్త లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్లకు మీడియాకు ముందుకు వచ్చిన ఆ హీరోను చూసి అసలు గుర్తుపట్టలేకపోతున్నారు. పైన ఫోటోను చూశారు కదా.. జుట్టు పెంచేసి.. సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తున్న ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

Tollywood: అయ్యా బాబోయ్.. ఆ యంగ్ హీరో ఇలా మారిపోయాడేంటీ..  ఎవరో గుర్తుపట్టారా..?
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 13, 2024 | 11:14 AM

టాలీవుడ్ స్టార్ హీరో వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అబ్బాయి.. కానీ ఇప్పటికీ సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటివరకు ఈ హీరో ఖాతాలో భారీ హిట్ పడలేదు. నటుడిగా విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ ఇప్పటికీ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. తొలి సినిమా నుంచి ఎంతో కష్టపడుతున్నా డిజాస్టర్ లేదా యావరేజ్ టాక్ అందుకుంటున్నాయి. చివరగా భారీ బడ్జెట్‏తో.. పూర్తిగా ఫిజికల్ లుక్ మార్చేసి ఎంతో కష్టపడి రూపొందించిన సినిమా కూడా నిరాశే మిగిల్చింది. సిక్స్ ప్యాక్ చేసి, జుట్టు పెంచి పూర్తిగా హాలీవుడ్ రేంజ్ కటౌట్‏తో.. యాక్షన్ మూవీతో అడియన్స్ ముందుగా వచ్చినా ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మరింత ఫోకస్ పెట్టాడు. ఇప్పటివరకు తన తదుపరి సినిమా ప్రకటించలేదు. అంతేకాకుండా చాలాకాలంగా సైలెంట్ అయ్యాడు. అటు సోషల్ మీడియాలో ఇటు బయట కూడా కనిపించడం లేదు. కానీ ఇప్పుడు ఈ హీరో కొత్త లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్లకు మీడియాకు ముందుకు వచ్చిన ఆ హీరోను చూసి అసలు గుర్తుపట్టలేకపోతున్నారు. పైన ఫోటోను చూశారు కదా.. జుట్టు పెంచేసి.. సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తున్న ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా..? తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు.. టాలీవుడ్ అగ్రకథానాయుకుడి కొడుకు. ఇంతకీ అతడెవరంటే.. అక్కినేని అఖిల్.

ప్రస్తుతం అఖిల్‏కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అఖిల్ ఎయిర్ పోర్టుకు వెళ్లగా అక్కడ తీసిన వీడియో అని తెలుస్తోంది. అందులో అక్కినేని హీరో జుట్టు పెంచేసుకొని ఊహించని సరికొత్త లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సిక్స్ ప్యాక్ చేసి కాస్త లావుగా మారాడు. అలాగే జుట్టు పెంచేసి అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అఖిల్ ను చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. అయ్యాగారేంటీ ఇలా మారిపోయాడు..? నెక్ట్స్ మూవీ కోసమా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అఖిల్ నెక్ట్స్ సినిమా కొత్త దర్శకుడు అనిల్ కుమార్ దర్శకత్వంలో ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. పీరియాడిక్ సబ్జెక్టుతో రాబోతున్న ఈ సినిమాకు ధీర లేదా తారక సింహా రెడ్డి అనే టైటిల్స్ కూడా పరిశీలిస్తున్నారట మేకర్స్. ఈ మూవీ కోసమే అఖిల్ ఇలా జుట్టు పెంచేశారని అంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి అయ్యగారు మాత్రం ఊహించని లుక్ లో కనిపించి అభిమానులను సర్ ప్రైజ్ చేశారనే చెప్పాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.