AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akkineni Akhil : నువ్వు అఖిల్ అయితే నేను నాగార్జున.. ప్రాంక్ కాల్‏లో సిసింద్రీని ఆటాడుకున్న అభిమాని.. నవ్వులే నవ్వులు..

ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వచ్చాడు లెనిన్. చాలా కాలం తర్వాత అక్కినేని అఖిల్ నటించిన ఈ సినిమాపై ముందు నుంచి మంచి హైప్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అఖిల్ పక్కా ఊరమాస్ అవతారంలో కనిపించాడు. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున నిర్మించగా.. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

Akkineni Akhil : నువ్వు అఖిల్ అయితే నేను నాగార్జున.. ప్రాంక్ కాల్‏లో సిసింద్రీని ఆటాడుకున్న అభిమాని.. నవ్వులే నవ్వులు..
Akkineni Akhil
Rajitha Chanti
|

Updated on: Jul 10, 2026 | 11:22 AM

Share

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లేటేస్ట్ సినిమా లెనిన్. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ముందుకువచ్చింది. అయితే ఈ సినిమా కోసం గత కొన్ని రోజులుగా అఖిల్, చిత్రయూనిట్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో నాగార్జున సందడి చేశారు. అయితే ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా అఖిల్, గెటప్ శీనుతో కలిసి సరికొత్త ప్లాన్ చేశారు. గెటప్ శీనుతో కలిసి ఇంటర్వ్యూ చేసిన వీడియోను లెనిన్ చిత్రయూనిట్ సోషల్ మీడియాలో పంచుకుంది. సరదాగా కాసేపు పేరుతో చేసిన ఈ ఇంటర్వ్యూలో అఖిల్, గెటప్ శీను కలిసి టీ తాగుతూ మస్క్ బన్ తింటూ సరదాగా ముచ్చటించారు. ఇందులో భాగంగా సినిమా విషయాలతోపాటు ఫన్నీ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఓ అపరిచితుడికి ఫ్రాంక్ కాల్ చేశాడు గెటప్ శీను.

ఎక్కువమంది చదివినవి : OTT Cinema : ఓటీటీలో గత్తరలేపుతున్న సినిమా.. ఒక్కో ట్విస్టు చూస్తే మతిపోవడం ఖాయం భయ్యా.. థ్రిల్లర్ ప్రియులకు సూపర్ ఛాయిస్..

ఫ్రాంక్ కాల్ చేసి అఖిల్ తో మాట్లాడించారు. “నేను అఖిల్ అక్కినేనిని మాట్లాడుతున్నాను” అని అఖిల్ చెప్పడంతో “అవునా.. నేను నాగార్జున మాట్లాడుతున్నా” అంటూ అవతలి వ్యక్తి పంచ్ ఇచ్చాడు. దీంతో అఖిల్ ఒక్కసారిగా నవ్వేశాడు. నేను నిజంగానే అఖిల్ మాట్లాడుతున్నాని ఎన్నిసార్లు చెప్పినా అవతలి వ్యక్తి నమ్మడు. నాగచైతన్య ఎలా ఉన్నాడో చెప్పు.. నా మనవడి వాయిస్ నేను గుర్తుపట్టలేను అనుకుంటున్నావా నాన్నా అఖిల్ అంటూ అక్కినేని నాగేశ్వరరావు వాయిస్ మిమిక్రీ చేశాడు అవతలి వ్యక్తి. దీంతో ఫోన్ తీసుకుని గెటప్ శీను అని చెప్పడంతో నేను సుధీర్ అంటూ మరోసారి పంచ్ ఇచ్చాడు అభిమాని. అలాగే అక్కినేని అఖిల్ నిజంగానే కాల్ చేశాడని గెటప్ శీను చెప్పడానికి ట్రై చేయగా.. నా నంబర్ అఖిల్ దగ్గర ఎందుకు ఉంటుంది అంటూ ప్రశ్నిస్తాడు అభిమాని.

ఎక్కువమంది చదివినవి : Anushka Shetty : ఆ సినిమాతో ఆయనకు పేరు వచ్చింది.. కానీ డబ్బులు రాలేదు.. అనుష్క కామెంట్స్..

ఇక ఎంత చెప్పినా అభిమాని నమ్మకపోవడంతో గెటప్ శీను ఫోన్ కట్ చేస్తాడు. అయితే ఫోన్ లో సంభాషణ జరుగుతున్నంతసేపు అఖిల్ మాత్రం పడి పడి నవ్వుతూనే ఉంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషళ్ మీడియాలో వైరలవుతుంది. లెనిన్ చిత్రానికి ఉదయం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించగా.. గెటప్ శ్రీను, శివాజీ, రాంకీ, ఈశ్వరరావు కీలకపాత్రలు పోషించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood: చాలా టార్చర్ చేశారు.. ట్రైన్‏లో నుంచి దూకి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

అక్కినేని అఖిల్ ఫ్రాంక్ కాల్..

ఎక్కువమంది చదివినవి : నవ్వులు పంచిన నటుడి జీవితంలో విషాదం.. గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న స్టార్ ఎవరంటే..

Follow Us