The Ghost: ఒకే వేదిక పై అక్కినేని అందగాళ్ళు.. అభిమానులకు పండగే..

|

Sep 24, 2022 | 10:07 AM

కింగ్ నాగార్జున ప్రస్తుతం గోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

The Ghost: ఒకే వేదిక పై అక్కినేని అందగాళ్ళు.. అభిమానులకు పండగే..
Akhil ,naga Chaitanya, King
Follow us on

కింగ్ నాగార్జున ప్రస్తుతం గోస్ట్(The Ghost)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే బంగార్రాజు సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న నాగ్ ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఎప్పటిలానే ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ పై ఇటు అభిమానుల్లో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ను ప్రవీణ్ సత్తార్ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందించినట్లుగా ప్రమోషనల్ వీడియోలు మరియు పోస్టర్స్ ను చూస్తుంటే అర్థం అవుతోంది. ఇక ‘ ది ఘోస్ట్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 25న కర్నూలులోని ఎస్టీబిసి గ్రౌండ్‌లో గ్రాండ్ గా జరగనుంది.

భారీ లెవల్ లో ఓపెన్ గ్రౌండ్ లో జరగబోతున్న ఈ పబ్లిక్ ఈవెంట్ కి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. టీమ్ మొత్తం ఈ వేడుకను ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకని మరింత ప్రత్యేకంగా చేయడానికి నాగ చైతన్య, అఖిల్ ఈ గ్రాండ్ ఈవెంట్ కి హాజరుకానున్నారు. చాలా కాలం తర్వాత స్టార్ తండ్రీ కొడుకులు కలిసి సినిమా వేడుకకి రావడం అక్కినేని అభిమానులకు కన్నుల పండుగ కానుంది. ఇక ‘ది ఘోస్ట్’ టీమ్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లతో అలరిస్తోంది. రీసెంట్ గా నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇంటెన్స్ ట్రైనింగ్ చూపించే వీడియో- గన్స్, స్వోర్డ్స్‌ని విడుదల చేసారు. భరత్‌, సౌరబ్‌ ద్వయం ఈ సినిమా పాటలని, బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..