Akil Akkineni : గాయపడ్డ అఖిల్.. అయ్యగారికి పెద్ద గాయమే అయిందిగా..

తాజాగా అఖిల్ చేతికి పెద్ద కట్టుతో కనిపించాడు. చూస్తుంటే అఖిల్ కు పెద్ద గాయమే అయ్యిందని తెలుస్తోంది. తాజాగా అఖిల్ సలార్ మూవీ సక్సెస్ పార్టీలో కనిపించాడు. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా 700కోట్ల వరకు వసూల్ చేసి నరికార్డ క్రియేట్ చేసింది సలార్.

Akil Akkineni : గాయపడ్డ అఖిల్.. అయ్యగారికి పెద్ద గాయమే అయిందిగా..
Akhil Akkineni
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 16, 2024 | 8:10 PM

అక్కినేని యంగ్ హీరో అఖిల్ హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు చేసిన సినిమాలన్నీ నిరాశపరచడంతో అఖిల్ తన నెక్స్ట్ సినిమా పై దృష్టిపెట్టాడు. ఇదిలా ఉంటే తాజాగా అఖిల్ చేతికి పెద్ద కట్టుతో కనిపించాడు. చూస్తుంటే అఖిల్ కు పెద్ద గాయమే అయ్యిందని తెలుస్తోంది. తాజాగా అఖిల్ సలార్ మూవీ సక్సెస్ పార్టీలో కనిపించాడు. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా 700కోట్ల వరకు వసూల్ చేసి నరికార్డ క్రియేట్ చేసింది సలార్. ఈ సక్సెస్ పార్టీ బెంగళూరులో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు అక్కినేని అఖిల్ హాజరయ్యాడు.

అయితే అఖిల్ సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అఖిల్  సినిమాతో హీరోగా పరిచయమైన అఖిల్ తొలి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ తో చేశాడు అఖి. ఈ సినిమా ఆశించిం స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను కూడా నిరాశపరిచాయి.

ఆతర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఆతర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన ఏజెంట్ సినిమా దారుణంగా నిరాశపరిచింది. బిగెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఏజెంట్. ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ యువి క్రియేషన్స్  బ్యానర్ లో ఓ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. సైలెంట్ గా ఈసినిమా షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఆ షూటింగ్ లో అఖిల్ గాయపడి ఉంటాడని అంటున్నారు.

View this post on Instagram

A post shared by FitFlop India (@fitflopin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.