Akhil Akkineni: నాటు నాటు పాటకు అఖిల్ స్టెప్పులు.. లాస్ట్‌లో అయ్యగారు ఇచ్చిన ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో

అక్కినేని అందగాడు యువ సామ్రాట్ అఖిల్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. జైనాబ్ రవడ్జీతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. అక్కినేని అఖిల్- జైనాబ్ పెళ్లి డేట్ కూడా ఆల్ మోస్ట్ ఫిక్స్ అయిందని, ఈ నెలలోనే ఈ శుభాకార్యం జరగనుందని తెలుస్తోంది.

Akhil Akkineni: నాటు నాటు పాటకు అఖిల్ స్టెప్పులు.. లాస్ట్‌లో అయ్యగారు ఇచ్చిన ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో
Akhil Akkineni

Updated on: Feb 23, 2025 | 2:31 PM

‘సిసింద్రి’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఇంట్రీ ఇచ్చాడు అఖిల్. మనం సినిమాతో స్పెషల్ రోల్ లో సందడి చేశాడు. ఆ తర్వాత అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హలో, మిస్టర్ మజ్ఞు, ది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, ఏజెంట్ సినిమాలతో ఆడియెన్స్ ను మెప్పించే ప్రయత్నం చేశాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ హ్యాండ్సమ్ హీరో త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనున్నాడు. జైనాబ్ అనే అమ్మాయితో కలిసి ఏడడుగులు నడవనున్నాడు. గతేడాది వీరి నిశ్చితార్థం జరిగింది. దీంతో అయ్యగారి పెళ్లి ముహూర్తం కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అఖిల్- జైనాబ్ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తుంది. మార్చి 24న అఖిల్ వివాహం జరగబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు దీని గురించి చర్చలు కూడా జరిపాయని, పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశామయని సమాచారం. త్వరలోనే అఖిల్ పెళ్లి తేదీపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఫంక్షన్ లో సందడి చేసాడు అఖిల్. ఈ సందర్భంగా తన ఫ్రెండ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేసాడు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అఖిల్ వేరే వ్యక్తితో కలిసి స్టెప్పులేశాడు. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే చివర్లో అఖిల్ కావాలనే కింద పడిపోయాడు. నాటు నాటు పాటలో రామ్ చరణ్ లాగే కావాలని పడ్డాడా? లేదా స్లిప్ అయ్యాడో తెలియదు కానీ మొత్తానికి కింద పడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రామ్ చరణ్ లా అఖిల్ కావాలనే పడిపోయాడని కామెంట్లు చేస్తున్నారు. ఇక అఖిల్ అక్కినేని తర్వాత సినిమా ప్రాజెక్టు గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

అఖిల్ అక్కినేని లేటెస్ట్ లుక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.