AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agent OTT : అయ్యగారు వచ్చేస్తున్నారు.. ఎట్టకేలకు ఓటీటీలోకి అఖిల్ ఏజెంట్

కొత్త హీరోలు, చిన్న హీరోలు సింపుల్ కథలతో హిట్లు అందుకుంటుంటే మా హీరోకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్క హిట్టు పడితే అఖిల్ కెరీర్ టర్న్ అవుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొన్నామధ్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా వచ్చినప్పటికీ అది పూజా హెగ్డే ఖాతాలోకి వెళ్ళింది.

Agent OTT : అయ్యగారు వచ్చేస్తున్నారు.. ఎట్టకేలకు ఓటీటీలోకి అఖిల్ ఏజెంట్
Akhil Agent
Rajeev Rayala
|

Updated on: Jan 08, 2024 | 7:59 AM

Share

ఒక్క హిట్టు ఒక్కటంటే ఒక్క హిట్టు పడితే చాలు అని చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాడు అక్కినేని అందగాడు అఖిల్. అప్పుడెప్పుడో వచ్చిన అఖిల్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా దగ్గర నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు కానీ సాలిడ్ హిట్ మాత్రం రుచిచూడలేకపోతున్నాడు. కొత్త హీరోలు, చిన్న హీరోలు సింపుల్ కథలతో హిట్లు అందుకుంటుంటే మా హీరోకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్క హిట్టు పడితే అఖిల్ కెరీర్ టర్న్ అవుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొన్నామధ్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా వచ్చినప్పటికీ అది పూజా హెగ్డే ఖాతాలోకి వెళ్ళింది. ఆ తర్వాత వచ్చిన ఏజెంట్ సినిమాతో స్టార్ హీరోగా మారిపోతాడు అని అంతా అనుకున్నారు కానీ సినిమా డిజాస్టర్ అయ్యింది.

ఈ సినిమాకు ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేశారు. ఈ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో బీస్ట్ లుక్ లోకి మారి అందరిని ఆకట్టుకున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది.

గతేడాది ఏప్రిల్‌ నెలలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా యంగ్ బ్యూటిఫుల్ నటి సాక్షి వైద్య నటించారు. సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలం అవుతున్నా ఈ సినిమా ఓటీటీలోకి మాత్రం రావడం లేదు. అసలు సినిమా ఎలా ఉంది అని చూడటానికి చాలా మంది ఎదురుచూస్తున్నారు. కానీ ఇంతవరకు ఓటీటీలోకి మాత్రం అడుగుపెట్టడం లేదు ఏజెంట్ . ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమాకు ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయని జనవరి 26న ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లీవ్ లో ఏజెంట్ సినిమా స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు.

అఖిల్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కెరీర్ ఖతం అనుకునేరు.. వాడు కోహ్లీ లెక్క.. ఫైనల్‌లో ఊహకందని ఊచకోత
కెరీర్ ఖతం అనుకునేరు.. వాడు కోహ్లీ లెక్క.. ఫైనల్‌లో ఊహకందని ఊచకోత
మీ జుట్టు రాలడానికి మెయిన్ రీజన్స్ ఇవే కావొచ్చు.. లైట్‌ తీసుకుంటే
మీ జుట్టు రాలడానికి మెయిన్ రీజన్స్ ఇవే కావొచ్చు.. లైట్‌ తీసుకుంటే
వారెవ్వా.. దీనిని వారానికి ఒక్కసారి తింటే చాలు.. అనారోగ్యం అనే..
వారెవ్వా.. దీనిని వారానికి ఒక్కసారి తింటే చాలు.. అనారోగ్యం అనే..
నాగార్జున అందాన్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా..
నాగార్జున అందాన్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా..
అప్పుడు ఆసీస్, ఇప్పుడు కివీస్.. గంభీర్ ప్లానింగ్ మాములుగా లేదుగా.
అప్పుడు ఆసీస్, ఇప్పుడు కివీస్.. గంభీర్ ప్లానింగ్ మాములుగా లేదుగా.
నిరుద్యోగులకు కొత్త అవకాశాలు.. డిజిటల్ కంటెంట్ హబ్‌గా హైదరాబాద్‌
నిరుద్యోగులకు కొత్త అవకాశాలు.. డిజిటల్ కంటెంట్ హబ్‌గా హైదరాబాద్‌
ఆడో మెంటలోడు.! రాసిపెట్టుకో.. అది RCB బ్లడ్ బరిలోకి దిగితే..
ఆడో మెంటలోడు.! రాసిపెట్టుకో.. అది RCB బ్లడ్ బరిలోకి దిగితే..
స్లో వైఫైతో చుక్కలు చూస్తున్నారా.. ఈ చిన్న ట్రిక్కులతో రాకెట్‌..
స్లో వైఫైతో చుక్కలు చూస్తున్నారా.. ఈ చిన్న ట్రిక్కులతో రాకెట్‌..
విజయ్ దళపతికి మరో షాకిచ్చిన భార్య..
విజయ్ దళపతికి మరో షాకిచ్చిన భార్య..
ఆ సర్పంచ్ పనితీరుకు సలాం కొడుతున్న గ్రామస్థులు
ఆ సర్పంచ్ పనితీరుకు సలాం కొడుతున్న గ్రామస్థులు