Akhanda 2: అక్కడుంది బాలయ్య.. తీస్తుంది బోయపాటి.. రికార్డు ధరకు ‘అఖండ 2 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్
బాలయ్య – బోయపాటి కాంబోలో రూపొందుతున్న అఖండ 2: తాండవం ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.. డిసెంబర్ ఫస్ట్ వీక్లో థియేటర్లలో చిత్రం గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి ...

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే మాస్ ఆడియన్స్‌కు ప్రత్యేక క్రేజ్. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి తీస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. 2021లో వచ్చిన అఖండ బ్లాక్ బాస్టర్ తర్వాత రూపొందుతున్న ఈ సీక్వెల్‌పై అభిమానుల్లోనే కాదు, మొత్తం సినీ పరిశ్రమలోనే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాపై ఉన్న హైప్ నేపథ్యంలో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల మధ్య పోటీ నెలకొంది. తాజాగా, నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ డీల్ రూ.80 – రూ.85 కోట్ల మధ్య క్లోజ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో డిజిటల్ రైట్స్ కొన్న నెట్‌ఫ్లిక్స్.. బాలయ్య గత చిత్రం డాకు మహారాజ్ హక్కులను కూడా ఫ్యాన్సీ రేటుకే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అఖండ సినిమాను హిందీకి డబ్ చేసి యూట్యూబ్‌లో విడుదల చేసినప్పుడు నార్త్ ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, ‘అఖండ 2: తాండవం’ను తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా అఘోరా పాత్రను బోయపాటి పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారని టాక్. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సమర్పిస్తున్న ఈ మూవీకి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. థమన్ గతంలో అఖండకు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. కాబట్టి అఖండ 2 కోసం థమన్ నుంచి ఇంకా పవర్ఫుల్ మ్యూజిక్ ఎక్స్‌పెక్టేషన్ ఉంది.
తొలుత ఈ చిత్రాన్ని 2024 సెప్టెంబర్లో దసరా కానుకగా విడుదల చేయాలని భావించినా, షూటింగ్ షెడ్యూల్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. తాజాగా అప్డేట్స్ ప్రకారం… సినిమా 2025 డిసెంబర్ ఫస్ట్ వీక్లో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల బాలకృష్ణ అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి నాలుగు వరుస హిట్స్‌తో సూపర్ ఫార్మ్‌లో ఉన్నారు. ఇప్పుడు అఖండ 2: తాండవంతో ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ రాబోతుందని అభిమానులు నమ్ముతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




