
ప్రముఖ నటుడు అజిత్ ఇటీవలే ప్రతిష్ఠాత్మక పద్మ భూషణ్ పురస్కారం అందుకున్నారు. దీంతో హీరో అభిమానులందరూ సంతోషంలో మునిగి తేలుతున్నారు. అయితే ఇంతలోనే తలా ఫ్యాన్స్ కు ఒక బ్యాడ్ న్యూస్ అందింది. అదేంటంటే.. అజిత్ కు గాయమైంది. కాలికి దెబ్బ తగలడంతో ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయాన్ని పరిశీలించిన వైద్యులు ప్రమాదమేమీ లేదని సూచించారని సమాచారం. అయితే అజిత్ గాయంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ హీరోకు ఏమైందోనని కంగారు పడుతున్నారు. దీనిపై స్పందించిన అజిత్ టీమ్ అభిమానులను కంగారు పడొద్దని సూచించింది. అన్నీ పరీక్షలు చేయించిన అనంతరం సాయంత్రం అజిత్ డిశ్చార్జ్ అవుతారని హీరో టీమ్ మీడియాకు తెలిపింది. కాగా ఢ పద్మభూషణ్ అవార్డు స్వీకరించిన అనంతరం అజిత్ కుటుంబం ఢిల్లీ నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు మంగళవారం (ఏప్రిల్ 29) రాత్రి చేరుకుంది. ఆ సమయంలోనే హీరోకు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఎయిర్ పోర్టుకు వచ్చారు. చాలామంది నటుడి వైపు దూసుకురావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలోనే అజిత్ కాలికి స్వల్ప గాయమైనట్టు టీమ్ తెలిపింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. అజిత్ కుమార్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. ఈ సినిమాలో సునీల్, అర్జున్ దాస్, సిమ్రాన్ కీలక పాత్రల్లో మెరిశారు. అంతకు ముందు విదాముయార్చి సినిమాతోనూ హిట్ అందుకున్నాడు అజిత్.ఇందులోనూ త్రిషనే హీరోయిన్ గా నటించడం విశేషం. మొత్తానికి రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్, ఇప్పుడు పద్మ భూషణ్ పురస్కారంతో అజిత్ అభిమానులు సంతోషంగా తేలియాడుతున్నారు. అయితే కొందరి అత్యుత్సాహంతో ఆయన ఇప్పుడు గాయపడ్డారు. ఏదేమైనా అజిల్ త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.
BREAKING: Ajith Kumar admitted in Apollo Hospital🏥 pic.twitter.com/pt0uYndR19
— Manobala Vijayabalan (@ManobalaV) April 30, 2025
President Droupadi Murmu presents Padma Bhushan in the field of Art to Shri S. Ajith Kumar. He is a towering figure in Indian cinema, particularly in the Tamil film industry. His ability to portray a wide spectrum of characters has cemented his reputation as one of the most… pic.twitter.com/ZDrBFoNiSu
— President of India (@rashtrapatibhvn) April 28, 2025