బుర్రబద్దలయ్యే ట్విస్ట్..! పెళ్లి కాకుండా బేబీ బంప్‌తో టాలీవుడ్ హీరోయిన్.. వైరల్‌గా మారిన సీమంతం ఫోటోలు..
తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామల్లో ఈ ముద్దుగుమ్మ ఒకరు.ఈ అందాల భామ కోలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే ఓ ఇంట్రెస్టింగ్ సినిమాతో తెలుగు పేక్షకులను పలకరించనుంది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు గట్టిగానే వినిపించాయి. కొంతమంది పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలుపెడుతుంటే..ఇంకొంతమంది విడాకులు అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు. కొంతమంది స్టార్ హీరో, హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నట్టు తెలిపి అభిమానులు షాక్ ఇచ్చారు. తెలుగు, తమిళ్, హిందీ ఇండస్ట్రీలో చాలా మంది విడాకులు అనౌన్ చేశారు. రెండు మూడేళ్లకు విడిపోయిన వారు కొందరైతే.. మరికొంతమంది 17, 18 ఏళ్ళు కలిసిఉండి కూడా విడిపోయారు. ఇదిలా ఉంటే మరికొంతమంది అసలు పెళ్లి అనే టాపిక్ దూరంగా ఉంటున్నారు. నాలుగు పదుల వయసు వచ్చినా కూడా పెళ్లి మాట ఎత్తని హీరోయిన్స్ కూడా ఉన్నారు. తాజాగా ఓ బ్యూటీ పెళ్లి కాకుండా బేబీ బంప్ తో కనిపించి షాక్ ఇచ్చింది. అంతే కాదు అమ్మడి సీమంతం ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరో తెలుసా.?
తాజాగా ఓ యంగ్ బ్యూటీ బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసి అందరిని షాక్ కు గురిచేసింది. ఆమె ఎవరంటే కోలీవుడ్ కుర్ర భామ ఐశ్వర్య లక్ష్మీ. తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామల్లో ఐశ్వర్య లక్ష్మీ ఒకరు. త్వరలోనే తెలుగు పేక్షకులను పలకరించనుంది ఈ అందాల భామ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సాయి ధరమ్ తేజ్ సరసన నటిస్తుంది. సంబరాల ఏటి గట్టు అనే సినిమాలో నటిస్తుంది. అంతకు ముందు సత్యదేవ్ తో కలిసి గాడ్సే అనే సినిమా చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిన్నదాని ఫోటోలు అందరిని షాక్ కు గురి చేస్తున్నాయి.
బేబీ బంప్ తో ఐశ్వర్య ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. అసలు విషయం ఏంటంటే.. అది నిజమైన బేబీ బంప్ కాదు. ఐశ్వర్య ప్రస్తుతం తమిళ్ లో సూరితో కలిసి మామన్ అనే సినిమా చేస్తుంది. మామన్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమా సెట్ లో దిగిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోల పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.




