డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి డైరెక్ట్ గా ‘ఉప్పెన’..!
ప్రస్తుతం పరిస్థితుల్లో ఓటీటీలో కొత్త సినిమాలు హడావిడి చేస్తున్నాయి. రానున్న రోజులలో ఓటిటి ప్లాట్ ఫామ్స్ థియేటర్స్ ను డామినేట్ చెయ్యనున్నాయి. తాజాగా రిలీజ్ కానీ బడా సినిమాలు… నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 లాంటి ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో .. డైరెక్ట్‌గా ఆడియెన్స్ ను పలుకరించేందుకు సిద్దమయ్యాయి. తాజాగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ ఉప్పెన కూడా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుందని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ […]

ప్రస్తుతం పరిస్థితుల్లో ఓటీటీలో కొత్త సినిమాలు హడావిడి చేస్తున్నాయి. రానున్న రోజులలో ఓటిటి ప్లాట్ ఫామ్స్ థియేటర్స్ ను డామినేట్ చెయ్యనున్నాయి. తాజాగా రిలీజ్ కానీ బడా సినిమాలు… నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 లాంటి ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో .. డైరెక్ట్‌గా ఆడియెన్స్ ను పలుకరించేందుకు సిద్దమయ్యాయి. తాజాగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ ఉప్పెన కూడా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుందని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ యాజమాన్యం చిత్ర నిర్మాతలకి భారీ డీల్ ఇవ్వడంతో ప్రొడ్యూసర్స్ ఓటీటీలోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. లాక్‌డౌన్ లేకపోతే ఏప్రిల్‌లోనే ఉప్పెన సినిమా ప్రేక్షకులను పలకరించాల్సి ఉంది.
ఇప్పటికే మూవీలో రిలీజైన పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దేవి శ్రీ ట్యూన్స్ కు మ్యూజిక్ లవర్స్ మెస్మరైజ్ అవుతున్నారు. ఈ సినిమాకు సుకుమార్ స్టోరీ అందించగా.. ఆయన శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో మెరవనున్నారు. హీరోయిన్‌గా క్రితి శెట్టి కూడా కుర్రకారు గుండెల్లో సెగలు రెపుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించారు.
