Kanguva: సూర్య కంగువా డిజాస్టర్ ఎఫెక్ట్.. కోలీవుడ్‌లో మొదలైన కొత్త వివాదం.. టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు

కోలీవుడ్ లో కొత్త వివాదం మొదలైంది. భారతీయ సినీ పరిశ్రమలో ఒకప్పుడు కోలీవుడ్ అంటే ప్రయోగాలకు పెట్టింది పేరు.. బహుభాషా చిత్రాలతో సత్తా చాటిన కోలీవుడ్.. ఇప్పుడు కనీస హిట్ల కోసం తహతహలాడుతోంది. టాలీవుడ్ శాండిల్ వుడ్.. పాన్ ఇండియా ఫార్ములాతో భారీ సీట్లతో సత్తా చాటుతుంటే తమిళ పరిశ్రమలు మాత్రం నామమాత్రపు విజయాలతో సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది.

Kanguva: సూర్య కంగువా డిజాస్టర్ ఎఫెక్ట్.. కోలీవుడ్‌లో మొదలైన కొత్త వివాదం.. టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు
Kanguva Movie
Follow us
Ch Murali

| Edited By: Basha Shek

Updated on: Nov 23, 2024 | 6:48 PM

ఇటీవల కోలీవుడ్ లో రిలీజైన భారీ బడ్జెట్ సినిమాల విడుదల తొలి రోజు టాక్ బయటకు రావడంతో కలెక్షన్లపై ఎఫెక్ట్ భారీగానే పడుతోందంటూ నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. వీటన్నింటికీ కారణం ఫస్ట్ షో పడగానే రివ్యూలు నిమిషాల్లో సోషల్ మీడియాలో రావడంతో నెక్స్ట్ షో కలెక్షన్ పైన ఎఫెక్ట్ పడుతుందంటూ నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సూర్య నటించిన కంగువా భారీ డిజాస్టర్ తర్వాత సినిమా రివ్యూలపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. సుమారు 400 కోట్లతో తొడకెక్కిన సూర్య నటించిన కంగువా భారీ డిజాస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం మోస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. సగటు సినీ అభిమాని విషయం పక్కనపెడితే సూర్య వీరాభిమానులకు సైతం సినిమా ఏమాత్రం నచ్చకపోవడంతో అందరూ నిరుత్సాహం లో మిగిలిపోయారు.. ఈమధ్య విడుదలైన కమలహాసన్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇండియన్ 2 కూడా భారీ మెజాస్టర్ గా నిలిచింది. అలాగే తమిళ సినీ పరిశ్రమలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకరైన అజిత్ సినిమాలు మినిమం గ్యారంటీగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది అజిత్ సినిమాలు సైతం ఇటీవల భారీ డిజాస్టర్ గా మిగిలిపోవడంతో కోలీవుడ్ దర్శక నిర్మాతల్లో నిరుత్సాహం కనిపిస్తోంది.

సినిమా సక్సెస్ కావడానికి అందులో మినిమం స్టఫ్ గా ఉండాల్సిన స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ టెక్నిక్స్ ఉన్నాయా లేవా అన్నది పక్కనపెట్టి సినిమా విడుదలైన తర్వాత థియేటర్ల వద్ద ప్రేక్షుకల అభిప్రాయాల పేరుతో వచ్చే రివ్యూస్ ద్వారా నెగిటివ్ కామెంట్స్ వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి ఎలక్షన్లలో భారీ తేడా ఉంటుంది అనేది నిర్మాతలు లేవనెత్తుతున్న అంశం. కనీసం సినిమా విడుదలైన వారం రోజులు పాటు సినిమాల్లో ఉన్న మైనస్ ఏంటనేది బయటకు రాకుంటే విడుదలైన సినిమాలు మిక్స్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా నష్టపోకుండా ఉంటాం అనేది నిర్మాతలు చెబుతున్న మాట. కాంగువ సినిమా టాక్ విషయంలో రివ్యూల పేరుతో ప్రేక్షకులను థియేటర్లకు రానివ్వకుండా చేయడంలో నెగిటివ్ టాక్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్లే తమకు తీవ్ర నష్టం జరిగిందనేది నిర్మాణ సంస్థ చెబుతోంది. ఇటీవల కారణంగా రిలీజ్ అయిన ఒకటి రెండు రోజుల్లోనే డిజాస్టర్ గా మిగిలిన చిత్రాల నిర్మాతలు కూడా ఇదే అంశాన్ని గట్టిగా సమర్థిస్తూ నిర్మాతలు అందరూ కలిసి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

అదేంటంటే సినిమా రిలీజ్ అయిన థియేటర్ల వద్ద ప్రేక్షకుల నుంచి సినిమా టాకు ఎలా ఉంది అన్నది తీసుకోవడం పై నిషేధం విధించాలని నిర్మాతలు అందరూ కలిసి చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సినిమా విడుదల తర్వాత మరుసటి రోజు ఇచ్చే రివ్యూల కంటే థియేటర్ల వద్ద బయటికి వచ్చిన ప్రేక్షకులు సినిమాలోని మైనస్ లు బయట పెట్టడం వల్ల టీవీల్లో సోషల్ మీడియాలో చూసిన ప్రేక్షకులు ఆ సినిమా చూసేందుకు థియేటర్లకు రావడం లేదనేది నిర్మాతల అభిప్రాయం. అందుకే థియేటర్ల వద్ద ఎలాంటి అభిప్రాయ సేకరణ జరగకూడదని అందుకోసం థియేటర్ల యాజమాన్యాలు సహకరించాలని నిర్మాతల మండలి కోరింది. ఇందదుకు థియేటర్ల యాజమాన్యాల సైతం అంగీకరించాయి. గతంలోల థియేటర్ కాంపౌండ్ లోకి మీడియా యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు షూట్ చేయడానికి అనుమతి లేదని ప్రకటన చేశారు. సినిమా హిట్టా పట్టా అన్నది తెలుసుకోవడం ప్రేక్షకుడిగా తమకు ఉన్న కనీస హక్కు అని ప్రేక్షకులు నిర్మాతల నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. నిజాన్ని దాచి ఫ్లాప్ అయిన సినిమాలను విజయవంతం చేయాలనుకోవడం మమ్మల్ని మోసం చేయడమేనని, నిజంగా మీకు కలెక్షన్లు కావాలనుకుంటే మాకు నచ్చే విధంగా సినిమాలు తీయండి లేకుంటే మానుకోండి అంతేకానీ మీ కలెక్షన్ల కోసం రివ్యూలు కుదరదు అంటే ఒప్పుకునేది లేదని.. కాదంటే మాకు ఉన్న ఆప్షన్లు మేం చూసుకుంటామంటూ సోషల్ మీడియా వేదికగా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే