AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irumudi: నిన్న రామ్ చరణ్.. నేడు చిరంజీవి.. ‘ఇరుముడి’పై మెగాస్టార్ ప్రశంసలు.. రవితేజ రిప్లై ఏంటంటే?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 'ఇరుముడి' సినిమా ఫీవర్ నడుస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. అందుకు తగ్గట్టే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ట్రేడ్ నిపుణులు సైతం ఊహించని విధంగా కలెక్షన్లు వస్తున్నాయి.

Irumudi: నిన్న రామ్ చరణ్.. నేడు చిరంజీవి.. 'ఇరుముడి'పై మెగాస్టార్ ప్రశంసలు.. రవితేజ రిప్లై ఏంటంటే?
Chiranjeevi, Irumudi Movie
Basha Shek
|

Updated on: Aug 27, 2026 | 5:00 PM

Share

మాస్ మహరాజా రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా ‘ఇరుముడి’. గత శుక్రవారం (ఆగస్టు 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డివోషనల్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ట్రేడ్ నిపుణులు సైతం ఊహించని విధంగా రికార్డు కలెక్షన్లు రాబడుతూ రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే ఇరుముడి సినిమాకు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ఇక సాధారణ ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు కూడా ఇరుముడి సినిమాను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా, రామ్ చరణ్ లాంటి స్టార్స్ ఇరుముడి సినిమాపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా రవితేజ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ ను పంచుకున్నారు చిరంజీవి.

‘ఇరుముడి’ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన నా ప్రియ సోదరుడు రవితేజకి హృదయపూర్వక అభినందనలు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిగా ఆస్వాదించాను. రవితేజ చాలా అద్భుతంగా నటించాడు. త్రినాథ్‌ పాత్రను తన భుజాలపై మోశాడు. దర్శకుడు శివనిర్వాణ ఈ సినిమాను ఎమోషన్స్ తో చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. బేబీ నక్షత్రకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆశీస్సులు. చిత్ర బృందానికి, నిర్మాతలకు, నవీన్ యెర్నేని, ఇతరులకు నా హృదయపూర్వక అభినందనలు. ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి’అని చిరంజీవి ట్వీట్ చేశారు. దీనికి రవితేజ కూడా వెంటనే రిప్లై ఇచ్చారు. ‘అన్నయ్య..థ్యాంక్యూ సో మచ్‌’ అని రీట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం మెగాస్టార్ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

చిరంజీవి ట్వీట్..

ఇరుముడి సినిమా విషయానికి వస్తే.. డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే బేబీ నక్షత్ర, సాయికుమార్, స్వాసిక, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.

రామ్ చరణ్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us