Raghava Lawrence: లారెన్స్ అడుగు జాడల్లో మరో స్టార్ యాక్టర్.. పేద రైతులకు ట్రాక్టర్లు అందజేత.. వీడియో

కోలీవుడ్ స్టార్‌ హీరో కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ ఈ మధ్యన సినిమాల కంటే సమాజసేవలోనే ఎక్కువగా బిజిబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే తన ఫౌండేషన్ ద్వారా వేలాది మంది పేద పిల్లలకు ఉచితంగా వైద్యం, వసతి, ఆహారం సమకూరుస్తోన్న ఆయన ఇప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసం నడుం బిగించారు.

Raghava Lawrence: లారెన్స్ అడుగు జాడల్లో మరో స్టార్ యాక్టర్.. పేద రైతులకు ట్రాక్టర్లు అందజేత.. వీడియో
Raghava Lawrence

Updated on: Jun 19, 2024 | 7:02 AM

కోలీవుడ్ స్టార్‌ హీరో కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ ఈ మధ్యన సినిమాల కంటే సమాజసేవలోనే ఎక్కువగా బిజిబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే తన ఫౌండేషన్ ద్వారా వేలాది మంది పేద పిల్లలకు ఉచితంగా వైద్యం, వసతి, ఆహారం సమకూరుస్తోన్న ఆయన ఇప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసం నడుం బిగించారు. ఇందులో భాగంగా పేద రైతులు, కూలీలకు తన వంతు సహాయం అందజేస్తున్నారు. మాత్రమ్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే పలువురు పేద రైతులకు ట్రాక్టర్లు అందజేశారు రాఘవ లారెన్స్. అలాగే దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, మహిళలకు కుట్టు మిషన్లు అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. కాగా గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే పది మంది పేద రైతులకు ట్రాక్టర్లు అందించారు రాఘవ లారెన్స్. ఈయన సాయం చూసి మరో స్టార్ నటుడు పేద రైతులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. లారెన్స్ తరహాలోనే అన్నదాతలకు ట్రాక్టర్లు అందజేసేందుకు రెడీ అయ్యారు. ఆయనెవరో కాదు జిగర్తాండ డబుల్ ఎక్స్‌ చిత్రంలో రాఘవ లారెన్స్ తో కలిసి నటించిన నటుడు, డైరెక్టర్ ఎస్ జే సూర్య.

తాజాగా తన సొంత డబ్బులతో ట్రాక్టర్ కొనుగోలు చేసిన ఎస్ జే సూర్య దానిని కాంచీపురం జిల్లాకు చెందిన బద్రీకి అందజేశారు. ఈ విషయాన్ని రాఘవ లారెన్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ జే సూర్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడీ రియల్ హీరో. ఇప్పుడు లారెన్స్, ఎస్ జే సూర్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.లారెన్స్ తో పాటు ఎస్ జే సూర్యపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వీరిని చూసి మరికొందరు స్టార్ హీరోలు సాయం చేసేందుకు ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 

పేద రైతుకు ట్రాక్టర్ అందజేస్తోన్న డైరెక్టర్ ఎస్ జే సూర్య, వీడియో ఇదిగో..

 

తాను చదివించిన పిల్లలతో రాఘవ లారెన్స్.. వీడియో

 

రైతుకు ట్రాక్టర్ అంజేస్తున్న రాఘవ లారెన్స్.. వీడియో

దివ్యాంగులకు త్రీ వీలర్ బైక్స్ పంపిణీ.. వీడియో..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us