Allu Arjun: పుష్ప 2 సక్సెస్ జోష్.. మరో క్రేజీ డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టిన అల్లు అర్జున్.. ఎవరూ ఊహించని కాంబో

|

Dec 08, 2024 | 12:41 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.ఈ సినిమాతో బన్నీ మాస్ ఇమేజ్ మరింత రెట్టింపు అయ్యింది. పుష్ప 2 సక్సెస్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ కాస్త విరామం తీసుకుని మళ్లీ తన తర్వాతి సినిమాకు రెడీ అవ్వనున్నాడు.

Allu Arjun: పుష్ప 2 సక్సెస్ జోష్.. మరో క్రేజీ డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టిన అల్లు అర్జున్.. ఎవరూ ఊహించని కాంబో
Allu Arjun
Follow us on

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా సుమారు రూ.500 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా వసూళ్లు 1000 కోట్లు దాటుతాయి. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ మాస్ అవతార్‌లో క‌నిపించి అభిమానులను అలరించాడు. అయితే దీని తర్వాత బన్నీ కాస్త విరామం తీసుకోవాలని భావిస్తున్నాడట. అయితే తాజాగా అతను ఓ కామెడీ సినిమా కథను విన్నట్లు సమాచారం. ‘పుష్ప 2’ సినిమాను పూర్తి చేసిన అల్లు అర్జున్.. చిన్న విరామం తర్వాత త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేయనున్నాడు. త్రివిక్రమ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఆ తర్వాత మలయాళ చిత్ర దర్శకుడి సినిమాలో అల్లు అర్జున్ నటిస్తాడని తెలుస్తోంది.మాలీవుడ్ లో కామెడీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓ క్రేజీ డైరెక్టర్ మూవీకి అల్లు అర్జున్ ఓకే చేశారని తెలుస్తోంది. ‘జయ జయ జయ జయ హై’, ‘గురువాయురు అంబాలందయాలి’, ‘వాలా’ వంటి సూపర్ హిట్ మలయాళ హాస్య చిత్రాలకు దర్శకత్వం వహించారు విపిన్ దాస్. ప్రస్తుతం మలయాళంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకరైన విపిన్ దాస్ తదుపరి చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటించనున్నాడని సమాచారం. .

విపిన్ దాస్ ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ఫుట్‌బాల్ కథ ‘సంతోష్ ట్రోఫీ’లో బిజీ బిజీగా ఉంటున్నాడు. విపిన్ దాస్ సినిమాల్లో కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే అంతర్లీనంగా సామాజిక సందేశం కూడా ఉంటుంది. సూపర్ హిట్ సినిమా ‘జయ జయ జయహే’లో మహిళలపై జరిగే గృహహింస కథాంశాన్ని హాస్యంతో తెరకెక్కించారు. పెళ్లి, దానికి ముందు జరిగే ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘గురువాయూర్ అంబాలందయాలి’. ఇప్పుడు అదే తరహాలో అల్లు అర్జున్ కోస విపిన్ దాస్ కథ రెడీ చేశారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మలయాళ దర్శకుడితో సినిమా!

కాగా ఈ మధ్యన విపిన్ దాస్ పేరు టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. గతంలో న్యాచురల్ స్టార్ నానితో కూడా అతను ఒక సినిమా తెరకెక్కించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఏది నిజమో? ఏది అబద్ధమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.