అడవి శేష్.. ఈ ఆమధ్య కాలంలో టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు ఇది. ఈ యంగ్ హీరో కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు. మొన్నామధ్య మేజర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న అడవి శేష్.. రీసెంట్ గా హిట్2 తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. హీరోగానే కాదు దర్శకుడిగా.. రచయితగాను తన ప్రతిభను చాటుకున్నాడు. త్వరలో హిట్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హిట్ 3 సినిమాలో నేను కూడా ఉన్నాను అంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు శేష్. ఇదిలా ఉంటే తాజాగా అడవి శేష్ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. హీరోగా హిట్లు అందుకుంటున్న శేష్.. ఏమాత్రం గర్వం లేకుండా చాలా ఒదిగి ఉంటారు. పెద్దలు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు.
గతంలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షోకు హాజరైన శేష్. బాలయ్యకు పాదాభివందనం చేశాడు. తాజాగా సీనియర్ హీరోయిన్ రేవతి కాళ్లకు నమస్కరించాడు. హీరోయిన్ రేవతి దర్శకురాలిగా మారి బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నారు. ‘సలామ్ వెంకీ’ అనే టైటిల్ తో ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో కాజోల్ ప్రధానపాత్రలో నటిస్తున్నారు.. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 9న రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ కు శేష్ గెస్ట్ గా హాజరయ్యాడు.
ఈ ఈవెంట్ లో హీరోయిన్ కాజోల్ .. గురించి ఆమె నటన గురించి.. అలాగే రేవతి గురించి మాట్లాడాడు శేష్. మాట్లాడడం అయిపోయిన తర్వాత రేవతి కాళ్లకు నమస్కారం చేసి తన సంస్కారాన్ని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గర్వం లేని గొప్ప నటుడు అడవి శేష్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.
Once a fan, always a fan. On the way to #HIT2 promotions, had to stop by and make an appearance for my dear Revati ma’am’s #SalaamVenky press meet…and there …I met the legendary #Kajol…and all I could do was sing #SurajHuaMaddham pic.twitter.com/D7UFLS8Lwx
— Adivi Sesh (@AdiviSesh) December 6, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..