Bigg Boss 6: మళ్ళీ బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ వాసంతి కృష్ణన్..

తాజాగా స్టార్ మా లో కొత్త సీరియల్ "అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు" ప్రసారం కానుంది. ఈ సీరియల్ ప్రోమో ఇటీవల నిర్మాతలు విడుదల చేశారు. ఈ సీరియల్ లో తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ నటించడం విశేషం. 

Bigg Boss 6: మళ్ళీ బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ వాసంతి కృష్ణన్..
Avun Valliddaru Ishta Paddaru
Follow us
Surya Kala

|

Updated on: Dec 08, 2022 | 9:44 AM

ప్రస్తుతం ఎంటర్మెంట్ ఛానల్ లో హవా అంటే స్టార్ మా దే అని చెప్పవచ్చు. జెమిని, జీ తెలుగు, ఈ టీవీ ఇలా అనేక ఎంటర్మెంట్ ఛానల్ కి సీరియల్స్ ప్రసారం అవుతున్నా.. ఎక్కువగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్ మాత్రం స్టార్ మా వే. అందుకనే.. టీఆర్పీ రేటింగ్ లో ఈ ఛానల్ లో ప్రసారం అవుతున్న సీరియల్స్ టాప్ 10 లో సుమారు 6 వరకూ ఉంటున్నాయి. కార్తీక దీపం, జానకి కలగనలేదు, గుప్పెడంత మనసు, గృహలక్ష్మి, వంటి అనేక సీరియల్స్ ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుని సూపర్ హిట్ గా సాగుతున్నాయి. తాజాగా స్టార్ మా లో కొత్త సీరియల్ “అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు” ప్రసారం కానుంది. ఈ సీరియల్ ప్రోమో ఇటీవల నిర్మాతలు విడుదల చేశారు. ఈ సీరియల్ లో తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ నటించడం విశేషం.

ఈ సీరియల్ లో సిద్దార్థ్ వర్మ డ్యూయల్ రోల్ నటిస్తుండగా.. బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ వాసంతి కృష్ణన్ మెయిన్ లీడ్ రోల్ లో కనిపించబోతుంది. వాసంతి ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది.

అయితే ‘అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ సీరియల్ కి హైప్ క్రియేట్ చేయడానికి ప్రోమోకి గీతు వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది.  ఇంతకీ ఈ సీరియల్ కథేంటి.. ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

సిద్దార్థ్ వర్మ.. మనోజ్, ఢిల్లీ అనే డ్యూయెల్ క్యారెక్టర్ లో అన్నదమ్ములుగా నటిస్తున్నాడు.  మనోజ్ ఒద్దికగా రాముడు మంచి బాలుడు అన్నట్లు ఉండగా.. ఢిల్లీ మాత్రం అల్లరిగా పక్కా మాస్ క్యారెక్టర్. వీరిద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టినా.. ఒకరు బెంగళూరులో ఉంటాడు. అతను డాక్టర్ చదవగా… మరొకడు ఢిల్లీ శ్రీ కాళహస్తిలో నివసిస్తూ ఉండరాదు.. ఇద్దరి రుచులు, అభిరుచులు భిన్నంగా ఉన్నా.. అమ్మాయి విషయంలో మాత్రం వీరి ఆలోచనలు కలిశాయి. ఒకరినే కళావతిని ప్రేమించారు. అయితే ఢిల్లీ మోసం చేసి తాను ఇష్టపడిన అమ్మాయి కళావతిని పెళ్లి చేసుకున్నాడు. మనోజ్ తన మాస్ మరదలిని పెళ్లిచేసుకోవాల్సి వచ్చింది. మరి మాస్ అబ్బాయికి క్లాస్ అమ్మాయి భార్య కాగా.. క్లాస్ అబ్బాయికి మాస్ అమ్మాయి భార్య అయింది. ఈ జంటలు ఎలా జీవితాన్ని గడపబోతున్నాయి.. ప్రేక్షకులకు ఏ విధంగా వినోదాన్ని పంచనున్నాయి తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.. త్వరలో స్టార్ మా లో పాటు డిస్నీ + హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. అంటూ వచ్చిన ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది..

అయితే ఈ సీరియల్ అలనాటి రాముడు భీముడు నుంచి కవల అన్నదమ్ముల కథలను తలపించే విధంగా ఉండడం విశేషం..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..