AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oleti Laxmi: ఈమె ఓలేటి లక్ష్మి కాదు.. అంతా ఫేక్.. అసలు ఆమె ఎవరో తెలుసుకుందాం పదండి

మీకు ఓలేటి లక్ష్మి ఎవరో తెల్సా..? శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చిన ఆమె నిజమైనా ఓలేటి లక్ష్మి అని మీరు నమ్ముతున్నారా..? అయితే పప్పులో కాలేసినట్లే.

Oleti Laxmi: ఈమె ఓలేటి లక్ష్మి కాదు.. అంతా ఫేక్.. అసలు ఆమె ఎవరో తెలుసుకుందాం పదండి
Hyper Aadhi Skit
Ram Naramaneni
|

Updated on: Dec 07, 2022 | 5:04 PM

Share

ఏవండోయ్ మీకు ఓలేటి లక్ష్మి గారు గుర్తున్నారా మీకు..? సోషల్ మీడియా యూజ్ చేసే అందరికీ ఈమె గురించి తెల్సు. కోవిడ్ వచ్చిందని చెప్పేందుకు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసిన హెల్త్ ఇన్‌స్పెక్టర్‌తో ఆమె సంభాషణ నవ్వులు పూయించింది. ఆమె అమాయకత్వంతో, తెలియనితనంతో చెప్పిన సమాధానాలతో పాటు తాను మాట్లాడకుండా చుట్టుపక్కల వారికి ఫోన్ ఇవ్వడంతో.. హెల్త్ ఇన్‌స్పెక్టర్‌ అసహనానికి లోనై కర్మ కొద్దీ దొరుకుతారు జనాలు, మీ దుంపలు తెగ.. మీరెక్కడ తయారయ్యార్రా బాబు అంటూ పంచ్‌లు పేల్చాడు. ఆ ఆడియో రికార్డింగ్ అప్పట్లో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటికి, ఇప్పటికీ అలా వైరల్ అవుతూనే ఉంది.

కాగా ఈ వీడియోను బేస్ చేసుకుని గతంలో చలాకీ చంటి జబర్దస్త్ కామెడీ షోలో ఓ స్కిట్ చేశాడు. అది విపరీతంగా క్లిక్ అయ్యింది. సూపర్ ఫన్ జనరేట్ అయ్యింది. యూట్యూబ్‌లో అయితే ఆ వీడియోను 23 లక్షల మందికి పైగా చూశారు. అయితే ఆ ఓలేటి లక్ష్మి ఆడియో క్లిక్ అయ్యింది కానీ ఆ మనిషి ఎవరో ఎవరికీ తెలిదు. అయితే ఓలేటీ లక్ష్మి ఈమే అంటూ తాజాగా శ్రీదేవి డ్రామాకు కంపెనీ ప్రొగ్రామ్‌కు ఓ మహిళను తీసుకొచ్చారు. అయితే ఆమె ఓలెటి లక్ష్మి కాదు. ఏదో ఆడియెన్స్‌ను మభ్యపెట్టి రేటింగ్ పొందే ప్రయత్నం చేశారు షో నిర్వాహకులు.

అసలు ఓలెటి లక్ష్మి కృష్ణా జిల్లాకు చెందినవారు. గతంలో ఆమెను కొన్ని యూట్యూబ్ చానల్స్ ఇంటర్వ్యూ చేశాయి కూడా. అర్థరాత్రి ఫోన్ చేయడంతో కాస్త భయపడి అలా మాట్లాడినట్లు ఆమె తెలిపారు. తొలుత అందరికీ తెలియడంతో ఇబ్బందిగా అనిపించిందని.. తర్వాత పెద్దగా పట్టించుకోలేదని.. జోక్‌గా అనిపించిందని ఆమె చెప్పారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం..

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్