AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయిందిగా.. ఆ స్టార్ హీరో సరసన లేడీ పవర్ స్టార్.?

తొలి సినిమాతోనే తన నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సాయి పల్లవి చాలా నేచురల్..

Sai Pallavi: సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయిందిగా.. ఆ స్టార్ హీరో సరసన లేడీ పవర్ స్టార్.?
Sai Pallavi
Rajeev Rayala
|

Updated on: Dec 08, 2022 | 4:13 PM

Share

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. మలయాళ మూవీ ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ భామ. తొలి సినిమాతోనే తన నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సాయి పల్లవి చాలా నేచురల్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిదా సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ రాణిస్తోంది. అలాగే తమిళ్ లోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. గ్లామర్ షో చేయకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తూ ఆకట్టుకుంటోంది ఈ అమ్మడు. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి ఆకట్టుకుంది సాయి పల్లవి. చివరిగా గార్గి సినిమాతో ప్రేక్షకులను అలరించింది.

తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉందని తెలుస్తోంది. సాయి పల్లవి బాలీవుడ్ లో నటించనుందని టాక్ వినిపిస్తోంది. అయితే హిందీలో ఈ అమ్మడు నటించే సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. సాయి పల్లవి హిందీలో నటించే సినిమాలో సీత పాత్ర చేస్తుందని తెలుస్తోంది. అల్లు అరవింద్ రామాయణ నేపథ్యంలో ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా కూడా రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. కృతి సనన్ సీతగా కనిపించనుంది. సైఫ్ అలీ ఖాన్ రావణాసుడు గా కనిపించనున్నాడు. ఈ సినిమాను మించి ఉండేలా అల్లు అరవింద్ రామాయణంను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ రాముడు పాత్రలో, హృతిక్ రోషన్ రావణుడిగా చేస్తారని టాక్. ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి
Follow Us
తెలుగులో తోపు హీరోయిన్.. చివరకు అంత్యక్రియలకు డబ్బుల్లేక..
తెలుగులో తోపు హీరోయిన్.. చివరకు అంత్యక్రియలకు డబ్బుల్లేక..
అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు..
అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు..
అర్ధశతకాలలో సెంచరీ.. టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్
అర్ధశతకాలలో సెంచరీ.. టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త
స్విమ్మింగ్ పూల్‌లో ప్రియుడితో ఎంజాయ్..అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన
స్విమ్మింగ్ పూల్‌లో ప్రియుడితో ఎంజాయ్..అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన
భర్తపై పోక్సో కేసు.. మోనాలిసా మిస్సింగ్..
భర్తపై పోక్సో కేసు.. మోనాలిసా మిస్సింగ్..
రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ
రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ
గంటల తరబడి హై హీల్స్ వేసుకుంటున్నారా? జాగ్రత్త! మీ మోకాళ్లు
గంటల తరబడి హై హీల్స్ వేసుకుంటున్నారా? జాగ్రత్త! మీ మోకాళ్లు
బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు
బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు
ఉలవచారు చికెన్ ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే
ఉలవచారు చికెన్ ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే