Adivi Sesh: నాకు సపోర్ట్ చేసిన హీరోలు ఆ ఇద్దరే.. అడవి శేష్ ఎమోషనల్ కామెంట్స్
కెరీర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసిన శేష్.. ఆ తర్వాత హీరోగా మారి మంచి విజయాలను అందుకున్నాడు. క్షణం, ఎవరు, గూఢచారి లాంటి సినిమాతో మంచి హిట్స్ అందుకున్నాడు శేష్

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో అడవి శేష్ ఒకరు. కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు అడవి శేష్. కెరీర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసిన శేష్.. ఆ తర్వాత హీరోగా మారి మంచి విజయాలను అందుకున్నాడు. క్షణం, ఎవరు, గూఢచారి లాంటి సినిమాతో మంచి హిట్స్ అందుకున్నాడు శేష్. ఇక రీసెంట్ గా వచ్చిన మేజర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఉగ్రమూకల నుంచి ఎంతో మంది ప్రాణాలను కాపాడి.. వీరత్వం పొందిన వీరుని కథలో మనకు కనిపించారు. మేజర్ ఉన్ని కృష్ణన్‌గా పాన్ ఇండియన్ రేంజ్‌లో అలరించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు శేష్. ఇక ఈ సినిమా థియేటర్స్ లో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందో.. ఓటీటీలోనూ అదే రేంజ్ లో భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంది.
ఇక ఇప్పుడు హిట్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు శైలేష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అడవి శేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
శేష్ మాట్లాడుతూ.. నేను నా జర్నీ గురించి ఆలోచిస్తున్నాను.. క్షణం సినిమా వరకు నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. ఆ సమయంలో అల్లు అర్జున్ ఓ పెద్ద లెటర్ రాసి నాకు సపోర్ట్ గా నిలిచారు. అలాగే మహేష్ బాబు క్షణం టీజర్ రిలీజ్ చేసి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత నాతో మేజర్ సినిమా చేసి పాన్ ఇండియా కు పరిచయం చేశారు. ఇలా ఈ ఇద్దరు హీరోలు నన్ను సపోర్ట్ చేశారని అన్నారు శేష్. అలాగే నా ఫేవరేట్ హీరో నాని. ‘గూఢచారి’, ‘ఎవరు’ సినిమాల ట్రైలర్స్‌ని నానినే రిలీజ్ చేశారు. ఓరోజు నా దగ్గరకు వచ్చి నీతో ఓ హిట్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తానని అన్నారు. ‘హిట్ 2’ సినిమా అలా లైన్‌కి వచ్చింది అని తెలిపారు శేష్. ఇక హిట్ 2 సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. హిట్ 2 డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.



