Telangana Politics: రేవంత్ రెడ్డి vs కిషన్ రెడ్డి.. ఇద్దరి మధ్య ఓ రేంజ్‌లో మాటల తూటాలు
తెలంగాణ రాజకీయం ఇప్పుడు కాంగ్రెస్ వర్సస్ బీజేపీగా మారింది. మరీ ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డే అడ్డుకుంటున్నారని రేవంత్ ఆరోపిస్తున్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తిప్పికొడుతున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెట్రో, ఆర్‌ఆర్‌ఆర్ సహా ఏ ప్రాజెక్ట్‌ను ఆమోదించారో చెప్పాలని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి కిషన్ రెడ్డి ఏ ప్రాజెక్టును తీసుకొచ్చారో సూటిగా చెప్పాలన్నారు. తెలంగాణలో తాము రూ.10 లక్షల కోట్ల పనులు చేపట్టామని చెప్పారు. ఏపీలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తారా? అని బీజేపీని రేవంత్ ప్రశ్నించారు.
అయితే ఆయనకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి బెదిరింపులకు బయపడేది లేదన్నారు. ఎవరినీ బెదిరించే మనస్తత్వం తనది కాదన్నారు. మెట్రోకు కేంద్రం తప్పకుండా సాయం చేస్తుందన్నారు. RRRను కేంద్ర కేబినెట్ ఆమోదించలేదని..త్వరలోనే కేబినెట్ ముందుకు RRR ప్రాజెక్ట్ వస్తుందన్నారు. ఏపీలో బీజేపీ సొంతంగా గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు.
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

