న్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా ఎవరూ ఊహించని స్టార్ హీరో!
01 March 2025
Basha Shek
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు వరుసగా అప్డేట్స్ కూడా వస్తున్నాయి.
ఈ చిత్రంలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ , కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఏకంగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు మోహన్ బాబు.
ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ భారీ ప్రాజెక్ట్ వచ్చే నెల (ఏప్రిల్) 25 వ తేదీన థియేటర్లలోకి రానుంది.
దీంతో ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. తాజాగా రిలీజైన కన్నప్ప టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా మంచు విష్ణు సోషల్ మీడియా వేదికన అభిమానులతో ముచ్చటించారు.
ఇందులో ఓ నెటిజన్.. కన్నప్ప ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలో నిర్వహిస్తారా? అని ప్రశ్నించగా.. విష్ణు అవును అని బదులిచ్చాడు.
ఆ తర్వాత ఈ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ ను ఆహ్వానిస్తారా? అని అడగ్గా.. మంచు విష్ణు తప్పకుండా ఆహ్వానిస్తాను సమాధానమిచ్చారు.
ఇక్కడ క్లిక్ చేయండి..