Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటి పూట బడులు ఎప్పటి నుంచంటే..?వీడియో

ఒంటి పూట బడులు ఎప్పటి నుంచంటే..?వీడియో

Samatha J

|

Updated on: Mar 01, 2025 | 7:09 AM

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పొద్దున 10 దాటగానే సూర్యుడు యాక్షన్‌లోకి దిగిపోతున్నాడు. మార్చి కూడా రాకుండానే ఎండల తీవ్రత ఓ రేంజ్‌లో పెరిగింది. దీంతో రోడ్ల వెంట బండ్లు పెట్టుకుని చిన్న.. చిన్న వ్యాపారాలు చేసేవారు అల్లాడిపోతున్నారు. ఇక బళ్లకు వెళ్లే విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎండల్లో స్కూల్‌కు వెళ్లేందకు అవస్థలు పడుతున్నారు. వెళ్లాక కూడా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. కాస్త ముందుగానే ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.ఇంత ఎండల్లో చిన్నారులను బయటకు పంపించడం కరెక్ట్ కాదనే అభిప్రాయం తల్లిదండ్రుల నుంచి కూడా వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో 35 డిగ్రీల నుండి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే వారంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎండల ధాటికి ఆరోగ్య సమస్యలు తప్పవని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం, అతి త్వరలో ఒంటి పూట బడులపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.మార్చి 1 నుంచి ఒంటి పూట బడులు పెడితే, విద్యార్థులకు ఎండల తీవ్రత నుండి ఊరట లభిస్తుందని విద్యార్థి సంఘాలు సూచిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం మార్చి మొదటి వారం తర్వాతే అంటే.. మార్చి 10వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహించే యోచనలో ఉంది.

మరిన్ని వీడియోల కోసం :

ప్రధాని మోదీ తీసుకునే సూపర్‌ ఫుడ్‌ ఇదే.. లాభాలు తెలిస్తే షాకవుతారు!

చివరి అమృత్‌స్నాన్‌.. ప్రయాగ్‌రాజ్‌కు కోటి మందికి పైగా.. వీడియో!

ఫంక్షన్‌ హాల్లో కాదు పంట పొలంలో పెళ్లి.. కారణమేంటంటే.. వీడియో

ఆ గ్రహశకలంతో భూమికి తప్పిన ముప్పు.. ఏం జరిగిందంటే..!వీడియో

Published on: Mar 01, 2025 07:06 AM