Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ 40 మీటర్లే అత్యంత కీలకం..రెస్క్యూ టీమ్ కు 3 ఆటంకాలు !

ఆ 40 మీటర్లే అత్యంత కీలకం..రెస్క్యూ టీమ్ కు 3 ఆటంకాలు !

Samatha J

|

Updated on: Mar 01, 2025 | 11:32 AM

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో 82 గంటల ఆపరేషన్‌ తర్వాత.. 40 మీటర్ల టాస్క్‌.. రెస్క్యూ సిబ్బందికి సవాల్‌ విసురుతోంది. అటువైపు 8 మంది కార్మికులు.. ఇటువైపు సహాయక బృందాలు.. మధ్యలో 40 మీటర్ల మేర శకలాలు, బురద మేట.. వీటిని తొలగిస్తే ఆపరేషన్ క్లైమాక్స్‌కి చేరినట్టే... కార్మికుల జాడ దొరికినట్టే. అయితే ఈ కఠినమైన పరిస్థితిని అధిగమించడం ఎలా అన్నది బిగ్ టాస్క్‌గా కనిపిస్తోంది. టన్నెల్‌లో చిక్కుకుపోయిన 8మందిని కాపాడే దిశగా శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు NDRF, SDRF, ఆర్మీ, నేవీ బృందాలు 12 కిలోమీటర్ వరకు లోకో ట్రైన్‌లో ప్రయాణం కొనసాగిస్తున్నాయి. ఆ తర్వాత కాలినడకన మరో వన్‌ అండ్ ఆఫ్ కిలోమీటర్‌ వరకు మాత్రమే వెళ్లగలుగుతున్నాయి. ఆ తర్వాత భయంకరమైన పరిస్థితి కనిపిస్తోంది. 40 మీటర్ల దూరం దాటి వెళ్లేందుకు సిబ్బందికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మెషిన్ శకలాలు మీటర్ల మేర పడిపోయాయి. భారీగా బరువుగా ఉండటంతో వాటిని బయటకు తీసేందుకు కష్టమవుతోంది.

ఇక బురద మేట.. నీటి ఊటతో బురద అంతకంతకూ పెరుగుతోంది. దాన్నంతా బయటకు తీయడం కూడా ఇబ్బందికరంగానే మారుతోంది. ఇక మూడోది కన్వేయర్ బెల్డ్‌.. 12 కిలోమీటర్ల తర్వాత సిబ్బంది కాలినడకన స్పాట్‌కి వెళ్లేది కన్వేయర్ బెల్ట్‌పైనే.. ఇది ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. దానిపై నడవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. దాన్ని రిపేర్ చేసేందుకు ఇంజనీర్ల బృందం లోపలికి వెళ్లింది. సొరంగంలో కార్మికుల్ని గుర్తించేందుకు స్నిపర్ డాగ్‌, ర్యాట్ హోల్ టీమ్ సేవల్ని ఉపయోగిస్తున్నారు. ఇక రోజులు గడుస్తున్నా కొద్దీ బాధిత కుటుంబాల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఒక్కొక్కరుగా ఎల్‌ఎల్‌బీసీ ప్రాంతానికి చేరుకుని.. తమ వాళ్ల ఆచూకీపై ఆరా తీస్తున్నారు. 40 మీటర్ల పాటు పేరుకుపోయిన బురద మేట.. టన్నెల్ బోరింగ్ మెషిన్ శకలాలను ఎంత త్వరగా వేగంగా తీస్తే అంత త్వరగా కార్మికుల్ని గుర్తించే వీలుంటుంది. ఈ ప్రక్రియను చాలా త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో రెస్క్యూ టీమ్ ముందుకెళ్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

ప్రధాని మోదీ తీసుకునే సూపర్‌ ఫుడ్‌ ఇదే.. లాభాలు తెలిస్తే షాకవుతారు!

చివరి అమృత్‌స్నాన్‌.. ప్రయాగ్‌రాజ్‌కు కోటి మందికి పైగా.. వీడియో!

ఫంక్షన్‌ హాల్లో కాదు పంట పొలంలో పెళ్లి.. కారణమేంటంటే.. వీడియో

ఆ గ్రహశకలంతో భూమికి తప్పిన ముప్పు.. ఏం జరిగిందంటే..!వీడియో