Adipurush: మూడో రోజు అదే దూకుడు.. ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ ఎంత వసూల్ చేసిందంటే

రామాయణ ఇతిహాస నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించారు. అలాగే సీతగా అందాల భామ కృతిసనన్  నటించగా హనుమాన్ గా దేవదత్ నటించారు. ఇక లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Adipurush: మూడో రోజు అదే దూకుడు.. ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ ఎంత వసూల్ చేసిందంటే
Adipurush
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 19, 2023 | 12:16 PM

భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ఆదిపురుష్. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రామాయణ ఇతిహాస నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించారు. అలాగే సీతగా అందాల భామ కృతిసనన్ నటించగా హనుమాన్ గా దేవదత్ నటించారు. ఇక లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అత్యాధునిక టెక్నాలజీ వాడి విజువల్ వండర్ గా తెరకెక్కించారు దర్శకుడు ఓం రౌత్.. కానీ ప్రేక్షకులను ఆ గ్రాఫిక్స్ ఆకట్టుకోలేక పోయింది. వీఎఫ్ఎక్స్ విషయంలో మరికొంత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

ఇక ఈ సినిమా తొలిరోజు నుంచి భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే అత్యధిక ఓపినింగ్స్ రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. మొదటి రోజే ఏకంగా 100కోట్లకు పైగా వసూల్ చేసింది ఈ సినిమా. అలాగే రెండో రోజుకే 200 కోట్ల మార్క్ ను దాటేసింది. ఇక ఇప్పుడు మూడో రోజు కూడా అదే దూకుడు చూపిస్తోంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా దూసుకుపోతోంది. మూడురోజులకు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 64.95 కోట్లు షేర్ రూ. 103.30 కోట్లు గ్రాస్ ను రాబట్టిందని తెలుస్తోంది. ఇక ఓవర్ ఆల్ గావరల్డ్ వైడ్ గా రూ. 302.50 కోట్లు గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఆదిపురుష్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు మాత్రం బాగానే రాబడుతోంది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?