Adah Sharma: ఆ సినిమా చేసినందుకు నన్ను వేశ్య అన్నారు.. అసభ్యకర మాటలతో ట్రోల్ చేశారు.. హీరోయిన్ ఆదా శర్మ..
గ్లామర్ రోల్స్ కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న యాక్షన్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఆమె సినిమాలు విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంటున్నా.. అవేం పట్టించుకోకుండా బ్యాక్ టూ బ్యాక్ వైవిధ్యమైన మూవీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. గతంలో ది కేరళ స్టోరీ సినిమాతో హిట్ అందుకున్న ఆదా.. ఇప్పుడు బస్తర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రివ్యూ అందుకున్న కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. కానీ ఈ మూవీలో మరోసారి తన నటనతో ప్రశంసలు అందుకుంది ఆదా శర్మ.
హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆదా శర్మ. ఫస్ట్ మూవీతో గ్లామర్ హీరోయిన్‍గా కనిపించిన ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్‍గా పలు చిత్రాల్లో కనిపించింది. అయినా ఈ బ్యూటీకి ఆశించినతంగా గుర్తింపు రాలేదు. దీంతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆదా.. ఇప్పుడు రూటు మార్చింది. గ్లామర్ రోల్స్ కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న యాక్షన్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఆమె సినిమాలు విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంటున్నా.. అవేం పట్టించుకోకుండా బ్యాక్ టూ బ్యాక్ వైవిధ్యమైన మూవీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. గతంలో ది కేరళ స్టోరీ సినిమాతో హిట్ అందుకున్న ఆదా.. ఇప్పుడు బస్తర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రివ్యూ అందుకున్న కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. కానీ ఈ మూవీలో మరోసారి తన నటనతో ప్రశంసలు అందుకుంది ఆదా శర్మ. అయితే ఈ సినిమాను అంగీకరించినందుకు కొందరు తనను దారుణంగా ట్రోల్ చేశారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సోషల్ మీడియాలో తాను ఏ పోస్ట్ చేసిన కామెంట్స్ మాత్రం ఈ చిత్రాన్ని ఉద్దేశించి వచ్చాయని..చాలా దారుణమైన మాటలతో విమర్శించారని అసహనం వ్యక్తం చేశారు.
బస్తర్ సినిమాను ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసిన సమయానికి ఇంకా తనను ఎంపిక చేయలేదన… అందులో తన ఫోటో కూడా లేదని అన్నారు ఆదా. కేవలం ఒక అడివిని చూపిస్తూ సినిమా పేరును మాత్రమే ప్రకటించారని.. కానీ అందులో నటించే నటీనటుల వివరాలను ఇంకా వెల్లడించలేదని.. కానీ అప్పటికే తాను ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు ప్రచారం జరిగిందని తెలిపింది. దీంతో తనను టార్గెట్ చేస్తూ నెట్టింట కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ది కేరళ స్టోరీ సినిమా సమయంలో కొందరు ఆ సినిమా చూడకుండానే మూవీ గురించి మాట్లాడారని తెలిపింది.
ఆదా మాట్లాడుతూ.. ” ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసే స్వేచ్ఛా మీకు ఉన్నట్లు.. బస్తర్ లాంటి సినిమా తీసే హక్కు మాకు ఉంటుంది.. ఆ విషయం ఎందుకు అర్థం చేసుకోరు ?. ఈ సినిమాలో నేను నటిస్తున్నానని ప్రకటించిన తర్వాత నాపై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయి. నేను అందంగా ఉన్న పువ్వుల ఫోటో పెట్టినా దానికి ఇబ్బందికరమైన కామెంట్స్ చేస్తున్నారు. వేశ్య వంటి పదాలను వాడుతూ ట్రోల్ చేస్తున్నారు. సినిమా చూసే ముందు తీర్పు చెప్పే వ్యక్తుల ఆలోచనలు చూసి తనకు మొదట్లో చికాకు కలిగింది .. ఆ తర్వాత మెల్లగా ఆ కోపం తగ్గిపోయింది.. ప్రస్తుతం ఎలాంటి వ్యాఖ్యలు వచ్చినా.. సినిమా చూడకుండా విమర్శించాలనుకున్నా పట్టించుకోను ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆదా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.