Shiva Rajkumar: లోక్ సభ ఎన్నికల్లో భార్య తరఫున ప్రచారం.. శివన్న సినిమాలను బ్యాన్ చేయాలంటూ డిమాండ్
కర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో స్టార్ హీరో శివరాజ్ కుమార్ సతీమణి గీత పోటీ చేస్తున్నారు. షిమోగా లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గీతా శివరాజ్‌కుమార్ బరిలోకి దిగనున్నారు. దీంతో భార్య తరఫున శివరాజ్ కుమార్ కూడా ప్రచారంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు.
కర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో స్టార్ హీరో శివరాజ్ కుమార్ సతీమణి గీత పోటీ చేస్తున్నారు. షిమోగా లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గీతా శివరాజ్‌కుమార్ బరిలోకి దిగనున్నారు. దీంతో భార్య తరఫున శివరాజ్ కుమార్ కూడా ప్రచారంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ కర్ణాటకలో శివన్నకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఇది ఎన్నికలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు శివరాజ్‌కుమార్ సినిమాలు, ప్రకటనలు, బిల్‌బోర్డ్‌లను ప్రదర్శించవద్దని థియేటర్లు, టీవీ ఛానెల్‌లు, సోషల్ మీడియా, స్థానిక సంస్థలను ఆదేశించాలని భారతీయ జనతా పార్టీ ఓబీబీసీ మోర్చా అధ్యక్షుడు రఘు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ‘ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తుందని నాకు నమ్మకం ఉంది. నా అభ్యర్థనపై కమిషన్ స్పందించి తగిన చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నాను’ అని రఘు లేఖలో రాసుకొచ్చారు శివ రాజ్ కుమార్.
ఇదిలా ఉంటే కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. తొలి దశలో ఏప్రిల్ 26న 14 నియోజకవర్గాలకు, రెండో దశలో మే 7న మిగిలిన 14 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. గీతా శివరాజ్‌కుమార్ పోటీ చేస్తున్న షిమోగాలో మే 7న ఓటింగ్ జరగనుంది. ఆమె సినీ పరిశ్రమకు చెందిన వారు కావును పలువురు సినీ ప్రముఖులు ఆమె తరఫున ప్రచారం చేయనున్నారు. శివరాజ్ కుమార్ నటించిన ‘కరటక దమనక’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమా ఇప్పటికీ చాలా చోట్ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అలాగే పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తున్నాడు శివన్న. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీకి చెందిన ఓబీసీ మోర్చా, శివన్న నటించిన సినిమాలు, ప్రకటనలు, బోర్డులను నిషేధించాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది.
భార్యతో కలిసి ఎన్నికల ప్రచారంలో శివరాజ్ కుమార్..
On the campaign trail with Geetha Shivarajkumar, our Congress candidate from my home constituency Shivamogga!
Fueled by determination and the spirit of change, she’s on a mission to secure victory and steer us towards a Congress-led INDIA Govt in Delhi. pic.twitter.com/0yNQwrH9Ag
— Srinivas BV (@srinivasiyc) March 20, 2024
ಇಂದು ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಬೈಂದೂರು ತಾಲೂಕಿನ ತ್ರಾಸಿ ಗ್ರಾಮದ “ಅಪ್ಪಣ್ಣಯ್ಯ ಸಭಾಭವನ” ದಲ್ಲಿ ವಂಡ್ಸೆ ಮತ್ತು ಬೈಂದೂರು ಬ್ಲಾಕ್ ಕಾಂಗ್ರೆಸ್ ವತಿಯಿಂದ ಆಯೋಜಿಸಿದ್ದ “ಕಾರ್ಯಕರ್ತರ ಸಭೆ”ಯಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ಮಾತನಾಡಿದೆನು…#Byndooru #KarnatakaElections2024 #Lokasabha #Election #GeethaShivarajkumar #GeethakkaForShimogga pic.twitter.com/8NycUlGhZQ
— Madhu Bangarappa (@Madhu_Bangarapp) March 22, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.