Keerthy Suresh: అయ్యో కీర్తి.. సూపర్ ఛాన్స్ మిస్సయ్యిందే.. మహానటిని వెనక్కు నెట్టిన ప్రియమణి..
చివరిసారిగా దసరా సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది కీర్తి. ఇందులో తెలంగాణ అమ్మాయిగా మరోసారి అద్భుత నటనతో కట్టిపడేసింది. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరింజీవి నటించిన భోళా శంకర్ మూవీలో చెల్లెలి పాత్రలో కనిపించింది. ఇక ఇప్పుడు ఆడపాదడపా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇన్నాళ్లు సౌత్ ఇండస్ట్రీలోనే సినిమాలు చేసిన కీర్తి.. ఇప్పుడు తొలిసారి హిందీలో మూవీ చేయబోతుంది.
సౌత్ ఇండస్ట్రీలో కీర్తి సురేశ్‌కు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ గెలుచుకుంది. పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా చేసేందుకు రెడీగా ఉంటుంది. బరువు పెరగడం.. సన్నతీగల మారిపోవడం ఈ బ్యూటీకి కొత్తేమి కాదు.. కంటెంట్ నచ్చితే చాలు ఢీగ్లామర్ రోల్స్ చేసేందుకు కూడా ముందుంటుంది. తన నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం అవకాశాలు అంతగా రావడం లేదు. కేవలం హీరోయిన్ రోల్స్ తప్పగా.. ఆమె నటనకు ఆస్కారం ఉండే పాత్రలు రావడం లేదు. చివరిసారిగా దసరా సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది కీర్తి. ఇందులో తెలంగాణ అమ్మాయిగా మరోసారి అద్భుత నటనతో కట్టిపడేసింది. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరింజీవి నటించిన భోళా శంకర్ మూవీలో చెల్లెలి పాత్రలో కనిపించింది. ఇక ఇప్పుడు ఆడపాదడపా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇన్నాళ్లు సౌత్ ఇండస్ట్రీలోనే సినిమాలు చేసిన కీర్తి.. ఇప్పుడు తొలిసారి హిందీలో మూవీ చేయబోతుంది.
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన ఓ ప్రాజెక్ట్ చేయనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా కంటే ముందే కీర్తి ఓ మూవీలో చేయాల్సి ఉందట. అది కూడా సీనియర్ స్టార్ హీరోకు జోడిగా కనిపించాల్సి ఉందట. కానీ వెయిట్ లాస్ కావడంతో ఆ ఛాన్స్ మిస్సయ్యిందని ఇటీవల డైరెక్టర్ అమిత్ శర్మ తెలిపారు. పూర్తి వివరాల్లోకెలితే.. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మైదాన్. భారత దిగ్గజ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్ అమిత్ శర్మ తెరకెక్కించారు. ఇందులో అజయ్ దేవగన్ భార్యగా ప్రియమణి కనిపించింది.
కానీ నిజానికి ఆమె స్థానంలో కీర్తి సురేష్ ఉండాల్సిందట. జీ స్టూడియోస్, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన మైదాన్ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమిత్.. ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలు కథానాయికగా కీర్తి సురేష్ నటిస్తే బాగుంటుందని అనుకున్నారట అమిత్.. ఈ మూవీలో అజయ్ దేవగణ్ అబ్దుల్ రహీమ్ పాత్రను పోషిస్తున్నారని.. ఆయన భార్యగా కొంచెం ప్రత్యేకంగా ఉండాలనుకున్నామని.. అందుకు కీర్తిని ఎంపిక చేశామని అన్నారు. కానీ అప్పటికే కీర్తి బాగా బరువు తగ్గారని.. దీంతో అజయ్ దేవగణ్ భార్యగా ఆమె సరిపోవడం లేదని.. దీంతో ఆమె స్థానంలోకి ప్రియమణిని తీసుకున్నామని అన్నారు అమిత్. అలాగే కీర్తి సురేష్ హిందీ ప్రాజెక్ట్ మిస్సయ్యింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.