
2014లో విడుదలైన నారా రోహిత్ సినిమా ‘రౌడీ ఫెలో’ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో రోహిత్ సరసన నటించి మెప్పించింది ప్రముఖ తమిళ హీరోయిన్ విశాఖ సింగ్. చూడచక్కని మోము, ఆకట్టుకునే అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందీ అమ్మాయి. 2007లో వచ్చిన ‘జ్ఞాపకం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన విశాఖ సింగ్ తమిళ్‌లో వరుసగా సినిమాలు చేసింది. అలాగే హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది. మొహర్రం అనే లఘుచిత్రం, అక్తం చక్తం అనే సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. ప్రస్తుతం తురం అనే తెలుగు సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోన్న విశాఖ సింగ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో హీరోయిన్ ఆస్పత్రి బెడ్ మీద ఉండడమే దీనికి కారణం.
‘ నేను అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుంటాను. కొన్ని భయంకరమైన సంఘటనలు, ప్రమాదాలు, చలికాలంలో ఆరోగ్య సమస్యలు తరచుగా నన్ను వేధిస్తున్నాయి. అయినా ఓ సంతోషకరమైన సమ్మర్ సీజన్ కోసం సిద్ధమవుతున్నా. ఏప్రిల్ ప్రతిసారి నాకు ఓ కొత్త ఏడాదిలా అనిపిస్తుంది. ఎందుకంటే అది కొత్త ఆర్థిక సంవత్సరం కారణంగానో లేక నేను పుట్టిన సంవత్సరం అవటం వల్ల కూడా కావచ్చు. ఎన్ని అడ్డంకులు వచ్చినా దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నాను’ అని ఇన్‌స్పిరేషనల్ పోస్ట్ షేర్ చేసింది విశాఖ. అయితే తన ఆరోగ్య సమస్యలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..