Varalakshmi Sharath Kumar: బాలయ్యను ఢీకొట్టనున్న జయమ్మ.. లేడీ పవర్‏ఫుల్ విలన్‏గా వరలక్ష్మీ శరత్ కుమార్..

ఈ సినిమా తర్వాత బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా గురించి పలు అప్డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Varalakshmi Sharath Kumar: బాలయ్యను ఢీకొట్టనున్న జయమ్మ.. లేడీ పవర్‏ఫుల్ విలన్‏గా వరలక్ష్మీ శరత్ కుమార్..
Varalakshmi

Updated on: Jul 03, 2022 | 4:54 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బాలయ్య పవర్ ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ తో సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్. ఈ సినిమా తర్వాత బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా గురించి పలు అప్డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇందులో బాలయ్య 50 ఏళ్ల వ్యక్తిగా కనిపించనున్నాడని.. అతని కూతురిగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే లేటేస్ట్ బజ్ ప్రకారం ఈ మూవీలో పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించనుందట. అంతేకాకుండా.. బాలయ్యకు.. వరలక్ష్మీ శరత్ కుమార్ కు మధ్య స్ట్రాంగ్ వార్ ఉండనుందట. ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ మొదటి వారం నుంచి జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో బాలయ్యను సరికొత్తగా చూపించనున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ అనిల్ రావిపూడి పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.