Varalakshmi Sarathkumar: అలాంటివారే నటీనటుల వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటారు..వరలక్ష్మి శరత్ కుమార్ కామెంట్స్..

|

Nov 08, 2022 | 10:14 AM

రోగసీ గురించి ఇండియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. కథ ఏ విధంగా ఉండబోతోంది? అని అడగ్గా.. సరోగసీ కాంప్లికేటెడ్ ఏమీ కాదు. కొంతమంది యాక్టర్స్ సరోగసీని

Varalakshmi Sarathkumar: అలాంటివారే నటీనటుల వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటారు..వరలక్ష్మి శరత్ కుమార్ కామెంట్స్..
Varalakshmi
Follow us on

వరలక్ష్మి శరత్ కుమార్.. నటుడు శరత్ కుమార్ వారసురాలిగా సినీ అరంగేట్రం చేసి అద్భుతమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అందరి అమ్మాయిల్లాగా కాకుండా.. విలనిజంతో మెప్పిస్తోంది వరలక్ష్మి. తెనాలి రామకృష్ణ బీఏ, బీఎల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. ఆతర్వాత మాస్ మాహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత నాంది, చేజింగ్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె కీలకపాత్రలో నటిస్తోన్న చిత్రం యశోద. ఇందులో సమంత కథానాయికగా నటిస్తోంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి ఆర్టిస్టుల వ్యక్తిగత జీవితాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

సరోగసీ గురించి ఇండియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. కథ ఏ విధంగా ఉండబోతోంది? అని అడగ్గా.. సరోగసీ కాంప్లికేటెడ్ ఏమీ కాదు. కొంతమంది యాక్టర్స్ సరోగసీని ఆశ్రయించడం వల్ల డిస్కషన్స్ జరుగుతున్నాయి. పిల్లలు లేని చాలా మందికి సరోగసీ ద్వారా పొందే అవకాశం కలుగుతోంది. ఈ కథలో సరోగసీ ఒక టాపిక్ అంతే! అందులో మంచి చెడుల గురించి చెప్పడం లేదు. ఇది ఫిక్షనల్ స్టోరీ. కానీ, సమాజంలో అటువంటి మనుషులు ఉన్నారని అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సెలబ్రెటీల జీవితంలో సరోగసి గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరికి వారు జీవితంలో సంబంధించిన విషయాలను పక్కన పెట్టేసి వేరే వారి జీవితంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా గమనిస్తూ ఉంటున్నారు. దీనికి కారణం వాళ్లకు పని లేకపోవడమే అంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

ఎవరైనా తమ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. దానిపై ఇతరుల అభిప్రాయాలు..చర్చలు అవసరమా ?. సినిమా ఆర్టిస్టుల పట్ల మీకు అభిమానం ఉంటే వారి సినిమా చూడండి. ఎలా ఉందో చెప్పండి. అంతేగానీ వాళ్ల పర్సనల్ విషయాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు అంటూ నిర్మోహ్మటంగా చెప్పేసింది.