AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టేజ్ పైనే రచ్చ రచ్చ.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌పై ఫైర్ అయిన కాంట్రవర్సీ లేడీ

ముగ్గురిని పెళ్లి చేసుకొని అందరిని షాక్ కు గురి చేసింది. అంతే కాదు చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అంతే కాదు ఆమెను తన ఫ్యామిలీ కూడా దూరం పెట్టేసింది. బయటకు వచ్చిన తర్వాత తన తండ్రి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు రావాల్సిన వాట ఇవ్వకుండా తనకు అన్యాయం చేశాడని ఆరోపించింది వనిత విజయ్ కుమార్. ఈ కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి.

స్టేజ్ పైనే రచ్చ రచ్చ.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌పై ఫైర్ అయిన కాంట్రవర్సీ లేడీ
Vanitha Vijay Kumar
Rajeev Rayala
|

Updated on: Jul 11, 2024 | 4:40 PM

Share

సీనియర్ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది ఈ చిన్నది. చాలా కాంట్రవర్సీల్లో ఇరుక్కుంది వనిత విజయ్ కుమార్. ఏకంగా ముగ్గురిని పెళ్లి చేసుకొని అందరిని షాక్ కు గురి చేసింది. అంతే కాదు చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అలాగే ఆమెను తన ఫ్యామిలీ కూడా దూరం పెట్టేసింది. బయటకు వచ్చిన తర్వాత తన తండ్రి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు రావాల్సిన వాట ఇవ్వకుండా తనకు అన్యాయం చేశాడని ఆరోపించింది వనిత విజయ్ కుమార్. ఈ కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. అలాగే ఆమధ్య బిగ్ బాస్ హౌస్ లోనూ పాల్గొంది ఆమె. వీటితోపాటు కొన్ని టీవీ షోల్లోనూ పాల్గొంది. ఇదిలా ఉంటే వనిత విజయ్ కుమార్ ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పై మండిపడింది.

ఇది కూడా చదవండి : Ramya Sri : బీ గ్రేడ్ సినిమాలో చేయమని ఆఫర్ చేశారు.. వాళ్ళందరూ పతివ్రతలు కాదు.. రమ్యశ్రీ బోల్డ్ కామెంట్స్

చంద్రలేఖ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వనిత విజయ్ కుమార్. దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. కోడిరామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ అనుకోకుండా ఆమె పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఆతర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక బుల్లితెరపై మాత్రం సందడి బాగానే చేసింది.

ఇది కూడా చదవండి : లావుగా ఉన్నావ్ అంటూ బాడీ షేమింగ్.. ఐరెన్ లెగ్ అని తిట్టిపోశారు.. కట్ చేస్తే నేషనల్ అవార్డు అందుకున్నస్టార్ హీరోయిన్

అయితే ఓ డాన్స్ షోలో ఆమె కంటెస్టెంట్ గా పాల్గొంది ఆ షోలో స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ జడ్జ్ గా వ్యవహరించారు. అయితే ఈ ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదామే జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణతో జరిగిన గొడవ గురించి మాట్లాడింది వనిత విజయ్ కుమార్. సదరు డాన్స్ షోలో వనిత కాళికా మాత వేషంలో డాన్స్ చేసింది. అయితే మేకప్ బాగుంది కానీ డాన్స్ అంతగా బాలేదు అని రమ్యకృష్ణ కామెంట్ చేశారు. దాంతో వనిత ఆగ్రహం వ్యక్తం చేసింది .  జడ్జ్‌మెంట్ ఇవ్వకుండా మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని చెబుతున్నారంటూ.. వేరేవాళ్లతో పోల్చుతున్నారేంటీ..? అంటూ మండిపడింది. ఆతర్వాత వనిత కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోయింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. రమ్యకృష్ణ తనకు చిన్నప్పటి నుంచి తెలుసు అని.. ఆమె మంచి నటి అని ప్రశంసించింది.అలాగే ఆమెతో ఎలాంటి గొడవలు లేవని.. కేవలం ఆమె చెప్పిన జడ్జ్‌మెంట్ నచ్చలేదు అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!