AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vanitha Vijay Kumar:  వనితా విజయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం..  ఎమోషనల్ పోస్ట్ చేసిన నటి.. 

వివాదాస్పద నటి వనితా విజయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.  ఆమె అక్క కూతురు అనిత గుండెపోటుతో మరణించింది.

Vanitha Vijay Kumar:  వనితా విజయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం..  ఎమోషనల్ పోస్ట్ చేసిన నటి.. 
Vanitha Vijaykumar
Rajitha Chanti
|

Updated on: Oct 15, 2021 | 12:24 PM

Share

వివాదాస్పద నటి వనితా విజయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.  ఆమె అక్క కూతురు అనిత గుండెపోటుతో మరణించింది. ఈ విషయాన్ని వనితా విజయ్ కుమార్ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది.  ఉదయాన్నే ఈ విషాదకర వార్తతో నిద్రలేచాను.. నా మేనకోడలు అనిత (20) మరణించింది. న్యూఢిల్లీలో సర్జరీ చేసుకున్న తర్వాత ఆమెకు గుండెపొటు రావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.. నాకు దేవుడిచ్చిన కూతురు తను.. నాకు పెద్ద కూతురు వంటిది. మా నాన్న సోదరుడి కూతురు ఇంద్ర.. వాళ్లు ప్రస్తుతం సింగపూర్ లో ఉంటున్నారు. ఇంద్ర చిన్న కూతురు అనిత. ఇంద్ర అక్క అంటే మా కుటుంబంలో అందరికి ఇష్టం.. అనిత దయాగుణం కలిగి  ఉండేది.. అన్నింటిని బాగా అర్థం చేసుకుంటుంది. నాకు ఎప్పుడు మద్దతుగా ఉంటుంది.

అలాగే నన్ను.. నా పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చింది.. కానీ మమ్మల్ని విడిచిపోయింది. తన తల్లిదండ్రులు సింగపూర్ లో ఉండడం వలన తన మృతదేహాన్ని అక్కడికే పంపించాము.. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నాను.. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.. మేము ఈ అక్టోబర్ లో కలుద్దామనుకున్నాం… తనను నా దగ్గరే 2 నెలలు ఉంచుకుందామనుకున్నాను.. కరోనా లాక్ డౌన్ కంటే ముందుగా గత రెండేళ్ల నుంచి కలుద్దామని ప్లాన్ చేస్తున్నాం.. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. నా గుండె బద్ధలైది.. మాటలు రావడం లేదు.. ఇప్పటికీ దీనిని నమ్మలేకపోతున్నాను.. ఇక ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు కూడా జరుపుకోవడం లేదు.. మేము మిగతా వారిలా ఉండలేం. కొందరు ఇలాంటి పరిస్థితులలో కూడా చీరలు, నగలతో అలంకరించుకుంటారు. అనితా మాకు లక్ష్మీదేవి వంటిది. మా మధ్య కనీసం హాయ్, బాయ్ కూడా చెప్పుకోలేదు.. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను స్వీట్ హార్ట్… అతన్, అంజన కోసమైన స్ట్రాంగ్ గా ఉండాలి.. అనితా ఎప్పటికే నా కూతరే అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది వనితా విజయ్ కుమార్.

పోస్ట్..

Also Read: Raviteja: దసరా స్పెషల్ సర్‏ప్రైజ్.. రవితేజ ధమాకా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..