ఊర్వశి పై మండిపడుతున్న అర్చకులు.. అంతా తూచ్..! ఆమె అలా అనలేదంటున్న హాట్ బ్యూటీ టీమ్

అందంలో ఊర్వశి. సినిమాల్లో అందమైన ప్రేయసి. మరి బుద్ధిజ్ఞానంలో రాక్షసిగా మారావా అంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఊర్వశి రౌతేలాను ఉతికి ఆరేస్తున్నాయి. ఐటమ్‌ గర్ల్‌ అంటూ జనం మండిపడుతున్నారు. ఇంతకీ ఊర్వశి చేసిన వివాదాస్పద కామెంట్స్‌ ఏంటి? అలాగే ఊర్వశి టీమ్ క్లారిటీ ఇచ్చింది.

ఊర్వశి పై మండిపడుతున్న అర్చకులు.. అంతా తూచ్..! ఆమె అలా అనలేదంటున్న హాట్ బ్యూటీ టీమ్
Urvashi Rautela

Updated on: Apr 19, 2025 | 10:35 AM

ఊర్వశి రౌతేలా.. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా మెరుస్తున్న తార. ఐటమ్‌ సాంగ్స్‌లో ఆటమ్‌ బాంబ్‌లా రెచ్చిపోయే సుందరి. ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ ముద్దుగుమ్మ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ సారి ఏకంగా తనకు గుడి కట్టారంటూ ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేసింది. ఉత్తరాఖండ్‌లో నాకు ఓ గుడి కట్టారు. బద్రీనాథ్‌కు దగ్గర్లోనే ఊర్వశి దేవాలయం ఉంది. జనం అక్కడికి వెళ్లి నా ఆశీర్వాదం తీసుకుంటారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు నన్ను భక్తిగా పూజ చేసి నా ఫోటోకు దండలు కూడా వేస్తారని చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి సినిమారా మావ..! థియేటర్స్‌లో డబుల్ డిజాస్టర్.. ఓటీటీలో 11 ఏళ్లుగా ట్రెండింగ్..

ఊర్వశి రౌతేలా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే ఆమె అంతటితో ఆగకుండా దక్షిణ భారతదేశంలో తనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని, అక్కడ కూడా తనకు రెండో ఆలయాన్ని నిర్మించాలని ఆశిస్తున్నా అనడంతో, ఈ దుమారం కాస్తా పెను తుఫాన్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :ప్రేమించి పెళ్లాడింది.. ముడుఏళ్ళకే విడాకులు.. కట్ చేస్తే మరొకరితో ఎఫైర్, మ్యారేజ్

నేను సౌత్‌లో మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, బాలయ్య బాబుతో నటించాను. అక్కడ కూడా నా అభిమానులు నా కోసం ఆలయం కట్టిస్తారని ఆశిస్తున్నా. దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నాను కాబట్టి, అక్కడ కూడా నాకు ఆలయం ఉంటే బాగుంటుంది అని చెప్పుకొచ్చింది. ఊర్వశి రౌతేలా వ్యాఖ్యలపై, ఊర్వశీ దేవి ఆలయ అర్చకులు మండిపడుతున్నారు. బద్రీనాథ్ సమీపంలోని బామ్నిలో ఊర్వశి పేరుతో ఆలయం ఉన్న మాట వాస్తవమేనని, అయితే, ఆ ఆలయానికీ నటికి సంబంధం లేదని తెలిపారు. పురాణాలు, స్థానికుల నమ్మకం ప్రకారం… సతీదేవి శరీర భాగం పడిన ప్రదేశం ఊర్వశీ దేవి ఆలయంగా మారిందని చెబుతారు. నటి ఊర్వశి.. అది తన పేరుతో ఉన్న ఆలయమని అందరినీ తప్పుదోవ పటిస్తున్నారని అర్చకులు మండిపడ్డారు. సతీదేవికి సంబంధించిన ఆలయంగా, 108 శక్తిపీఠాల్లో ఒకటిగా ఇక్కడి ప్రజలు దేవతను కొలుస్తారని తెలిపారు. అయితే ఈ వివాదం పై తాజాగా ఊర్వశి స్పందించింది. తాను అలా అనలేదు, తన మాటల్ని వక్రీకరిస్తున్నారని చెప్పుకొచ్చింది ఊర్వశి. తన పేరు మీద ఆలయం ఉందని మాత్రమే తాను చెప్పిందని, అది తన ఆలయం కాదని ఊర్వశి చెప్పుకొచ్చింది. ఆమె చెప్పిన మాటల్ని తప్పుగా తీసుకుని విమర్శిస్తున్నారని ఆమె టీం చెబుతోంది.

ఇది కూడా చదవండి : తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్.. కొత్తగా ఉందన్న దర్శకుడు పై మండిపడుతున్న నెటిజన్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.