తన అందం, అభినయంతో సుమారు రెండు దశాబ్ధాలుగా సినీ ప్రియులను అలరిస్తోంది అందాల తార త్రిష. నలభై ఏళ్లకుచేరువుతున్నా ఈ అమ్మడికి అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో కుందవై పాత్రతో మరోసారి మెప్పించిందీ ముద్దుగుమ్మ. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఓవైపు ఫీమెల్ సెంట్రిక్ ఫిలిమ్స్ చేస్తూనే మరోవైపు అజిత్, మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోల పక్కన స్ర్కీన్ షేర్ చేసుకుంటూ బిజిబిజీగా ఉంటోంది. పొన్నియన్ సెల్వన్ సినిమా విజయోత్సాహంలో ఉన్న త్రిష వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లింది. అయితే టూర్‌లో అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో ఆమె కాలు విరిగింది. దీంతో వెకేషన్ ను క్యాన్సిల్ చేసుకుని వెంటనే ఇండియాకు తిరిగొచ్చింది. ఈ విషయాన్ని త్రిష సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
కాలికి పట్టి వేసి ఉన్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన త్రిష.. ‘ప్రమాదం కారణంగా వెకేషన్ మధ్యలోనే రావాల్సి వచ్చింది’ అని పేర్కొంది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె పొన్నియన్ సెల్వన్ పార్ట్ -2లోనూ నటిస్తోంది. దీంతో పాటు సతురంగ వెట్టై పార్ట్ 2, ది రోడ్ (తమిళ్), రామ్ (మలయాళం) సినిమాలు చేస్తోంది. కాగా ఇటీవల త్రిష నటించిన పొన్నియన్ సెల్వన్ ఏకంగా రూ.460 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. త్రిషతో పాటు ఐశ్వర్యారాయ్, చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..