Trisha: ‘ఆ కారణంతో నవల పూర్తిగా చదివాను’.. పొన్నియిన్ సెల్వన్ పై త్రిష ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

|

Oct 03, 2022 | 8:20 AM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన ఈ మూవీలో విక్రమ్ చియాన్, ఐశ్వర్యరాయ్, కార్తి, జయం రవి, శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలలో నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Trisha: ఆ కారణంతో నవల పూర్తిగా చదివాను.. పొన్నియిన్ సెల్వన్ పై త్రిష ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Trisha
Follow us on

నాలుగు పదుల వయసులోనూ ఇప్పటి యువకథానాయికలకు పోటీనిస్తుంది హీరోయిన్ త్రిష. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు.. చాలా కాలం సినిమాకు దూరంగా ఉంది. ఇటీవలే 96 సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించింది. ఇందులో త్రిష యువరాణి కుందవై పాత్రలో కనిపించి మెప్పించింది. సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‏లోకి చేరింది. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాను నటించిన కుందవై పాత్ర గురించి తెలుసుకునేందుకు త్రిష.. రచయిత కల్కి రాసిన పొన్నియిన్ సెల్వన్ పుస్తకం మొత్తం చదివినట్లు తెలిపింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష మాట్లాడుతూ.. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా షూటింగ్ ప్రారంభం కాగానే.. ప్రపంచం మొత్తం కరోనా కారణంగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. దీంతో నేను నా ఖాళీ సమయాన్ని రచయిత కల్కి రాసిన పొన్నియిన్ సెల్వన్ పుస్తకం మొత్తం చదివాను. ఆ పుస్తకం పూర్తిగా భాగాలు ఉన్నాయి. చరిత్రకు సంబంధించిన పుస్తకాలను చదవడం కష్టమని నేను భావిస్తాను. కానీ ఆ నవల మాత్రం చాలా ఆసక్తిగా ఉంది. ఒక పుస్తకం అయిపోగానే మరొక పుస్తకం స్టార్ట్ చేశాను. నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే.. 5 భాగాలున్నా పుస్తకాన్ని కేవలం రెండు భాగాల్లో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నాకు ఊహకు అందని విషయం అంటూ చెప్పుకొచ్చింది త్రిష.

ఇవి కూడా చదవండి

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన ఈ మూవీలో విక్రమ్ చియాన్, ఐశ్వర్యరాయ్, కార్తి, జయం రవి, శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలలో నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.