స్టార్ హీరోయిన్ గా ఏలిన తమన్నా ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ తో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే బెల్లం కొండా సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు శ్రీను సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే స్పీడున్నోడు అనే సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేసింది. ఇక రీసెంట్ గా ‘కేజీఎఫ్’, ‘జైలర్’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో డ్యాన్స్ చేసి అదరగొట్టింది. తన డాన్స్ తో పాటు అందాలతోనూ తమన్నా కవ్విస్తుంది. గ్లామర్ డోస్ పెంచేసి మరీ స్టెప్పులేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ‘స్త్రీ 2’లో స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది మిల్కీ బ్యూటీ. ఈ పాట సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను పెంచేసింది. తమన్నా భాటియా స్పెషల్ సాంగ్‌కి కొత్త మెరుగులు దిద్దుతుంది. తమన్నా డ్యాన్స్ చూసి బాలీవుడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారు.
ఆగస్ట్ 15న ‘స్త్రీ 2’ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు. 2018లో ‘స్త్రీ’ సినిమా వచ్చింది. ఆ సినిమాలో నోరా ఫతేహి స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు సీక్వెల్‌లో తమన్నా భాటియాకు అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని తమన్నా చక్కగా వినియోగించుకుంది.
అమర్ కౌశిక్ ‘స్త్రీ 2’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రమోషన్స్ భారీగానే జరుగుతున్నాయి. ‘స్త్రీ’ హిట్ కావడంతో ‘స్త్రీ 2’ కూడా జనాలను ఎట్రాక్ట్ చేస్తుందనే నమ్మకం ఉంది. అందుకు తగ్గట్టుగానే తమన్నా భాటియా పాట అదరగొడుతోంది. ఈ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది. జైలర్ సినిమాలో తమన్నా చేసిన ‘కావలయ్యా..’ పాట పాపులర్ అయింది. ఆ సినిమా విజయంలో ఈ పాట కూడా తోడైంది. ‘స్త్రీ 2’ సినిమాలోనూ అలాంటి మ్యాజిక్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలోని పాటలో తమన్నా చాలా గ్లామర్‌గా స్టెప్పులేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.