Tollywood: 31 ఏళ్ల క్రితం ప్రపంచ సుందరి.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీతారలు ఎంత యాక్టివ్‏గా ఉన్నారో చెప్పక్కర్లేదు. నిత్యం తమ సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాలను సైతం అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ 31 ఏళ్ల నాటి ఫోటో ఇప్పుడు నెట్టింట పంచుకుంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..?

Tollywood: 31 ఏళ్ల క్రితం ప్రపంచ సుందరి.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
Sushmitha Sen

Updated on: May 21, 2025 | 3:12 PM

భారతీయ సినీ పరిశ్రమలో ఒకప్పుడు ఆమె టాప్ హీరోయిన్. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ 18 ఏళ్ల వయసులోనే యావత్ ప్రపంచాన్ని తన సౌందర్యంతో ఫిదా చేసింది. సరిగ్గా 31 ఏళ్ల క్రితం ప్రపంచ సుందరిగా నిలిచిన తొలి భారతీయ మహిళగా ఆమె రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో ఆమె పేరు ప్రపంచం మొత్తం మారుమోగింది. విశ్వసుందరిగా కిరీటాన్ని గెలిచిన సమయంలో ఆమె వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. ఇక ఇప్పుడు ఆ తీపి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకుంటూ తన మిస్ వరల్డ్ వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు సదరు హీరోయిన్. ప్రపంచ సుందరిగా నిలిచిన తర్వాత ఆమె సినీరంగం వైపు అడుగులు వేసింది. తెలుగు, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికీ సినీరంగంలో యాక్టివ్ గా ఉంటూ వరుస చిత్రాలలో నటిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ మిస్ వరల్డ్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ సుష్మితా సేన్.

1975 నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించింది. 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ సుందరిగా కిరీటం అందుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. “భారతదేశానికి చెందిన ఓ 18 ఏళ్ల అమ్మాయిని విశ్వానికి పరిచయం చేసిన చరిత్రాత్మక విజయం అది.. ఆశకు మరింత బలాన్నిస్తూ.. ప్రేమను మరింత ముందుకు నడిపిన రోజు. ప్రపంచమంతా పర్యటించడానికి జీవితంలో స్పూర్తినింపే ఎంతో మంది వ్యక్తులను కలిసే భాగ్యాన్ని పొందిన రోజు అధి. ఆ విషయంలో మా అమ్మకు.. ఆ దేవుడికి ఎప్పటికీ కృతజ్ఞతలు చెబుతూనే ఉంటాను. మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశం తొలిసారి విజయం సాధించి 31 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. నా దేశానికి ప్రాతినిధ్యం వహించే గౌరవం లభించినందుకు ఎప్పటికీ నేను గర్వంగానే ఉంటాను. కలలు పెద్దగా కనండి. వాటిని సాధ్యం చేసుకునేందుకు శ్రమించండి” అంటూ రాసుకొచ్చింది.

సుష్మితా సేన్.. హిందీ, తెలుగు భాషలలో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో నాగార్జున నటించిన రక్షకుడు సినిమాలో కనిపించింది ఈ భామ. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా అటు సామాజిక సేవ కార్యక్రమాల్లోనూ ముందు ఉంటుంది సుష్మితా సేన్. అలాగే ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఉంటుంది. ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకుంటుంది.

ఇవి కూడా చదవండి :  

Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..

Tollywood: రస్నా యాడ్‏లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?

Tollywood: అప్పుడు ఐశ్వర్య రాయ్‏కే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్..

Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..