Sudha: ఆ హీరో చేసిన సాయం జీవితంలో మర్చిపోలేను.. రాత్రికి రాత్రే కెరీర్ మారిపోయింది.. నటి సుధ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటి సుధ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో దశాబ్దాలుగా రాణిస్తున్నారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... తన సినీ ప్రస్థానాన్ని, చిరంజీవితో గ్యాంగ్ లీడర్ చిత్ర అనుభవాలను పంచుకున్నారు. తెలుగు చిత్రసీమలోకి తల్లిదండ్రులుతో అడుగుపెట్టి, బాలకృష్ణతో నటించారు.

సీనియర్ నటి సుధ తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, మెగాస్టార్ చిరంజీవితో ఆమెకున్న ప్రత్యేక అనుబంధం గురించి ఓ కార్యక్రమంలో వివరంగా పంచుకున్నారు. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి అగ్ర నటులతో నటించిన ఆమె, తన అనుభవాలను పంచుకున్నారు. సుధ 1981లో సినీ పరిశ్రమలోకి ప్రవేశించి, 1987లో తెలుగు చిత్రసీమలోకి వచ్చారు. ఆమె మొదటి తెలుగు చిత్రం బాలకృష్ణ సరసన తాతినేని రామారావు దర్శకత్వంలో తెరకెక్కిన తల్లిదండ్రులు. ఈ సినిమాలోకి ఆమె ఎంట్రీ వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది. ఒక సీరియల్‌లో ఆమె నటన చూసిన పరుచూరి బ్రదర్స్, బాలకృష్ణ సినిమాలో వదిన పాత్రకు ఆమెను ఎంపిక చేశారు. అప్పట్లో చెన్నైలో ఉన్న ఇండస్ట్రీ కావడంతో, తమిళ, తెలుగు మేనేజర్లు కలిసి ఆమెను సంప్రదించారు. ఆమెకు మొదట వితంతువు పాత్రను ఆఫర్ చేశారు, కానీ మరుసటి రోజు రాత్రికి రాత్రే పాత్రను మార్చి మోడరన్ క్యారెక్టర్‌గా మార్చారు. ఆ క్యారెక్టర్ మార్పు వల్లే తాను ఇప్పటికీ చిత్రాలు చేస్తున్నానని, లేకపోతే తన కెరీర్ కొనసాగి ఉండేది కాదని సుధ పేర్కొన్నారు. ఈ మార్పు ఆమె సినీ జీవితానికి ఒక మలుపుగా నిలిచిందని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..
తల్లిదండ్రులు చిత్రం తర్వాత, సుధ చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అప్పట్లో చిరంజీవి చాలా హ్యాండ్సమ్‌గా ఉండేవారని, ఇప్పటికీ అలాగే ఉన్నారని సుధ అన్నారు. గ్యాంగ్ లీడర్ మొదటి రోజు షూటింగ్‌లో చిరంజీవి, ఆమెను తమిళంలో పలకరించి, ఆమె తమిళ చిత్రాలను చూశానని చెప్పి, “మీరు బాగా చేస్తారు” అని ప్రోత్సహించారని ఆమె గుర్తుచేసుకున్నారు. అది ఆమెకు ఎంతో ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.
గ్యాంగ్ లీడర్లో మురళీమోహన్ సైకిల్‌పై వచ్చే సీన్, నిర్మలమ్మ కొట్టే సీన్ ఆమెకు మొదటి రోజు అనుభవం. అప్పట్లో తెలుగు స్పష్టంగా మాట్లాడలేని సుధకు, చిరంజీవి, మురళీమోహన్, నిర్మలమ్మ వంటి సహనటులు తెలుగు నేర్చుకోవడానికి ఎంతో సహాయపడ్డారట. సహనటుల సహకారం లేకుండా ఒక నటి రాణించడం చాలా కష్టమని, ఈస్ట్, వెస్ట్ అని కూర్చుంటే సినిమా అవుట్‌పుట్ బాగుండదని ఆమె చెప్పారు. అందరూ కలిసిమెలిసి ఉంటేనే పాత్రలు పండుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.
ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..
చిరంజీవితో ఆమె ప్రయాణం కేవలం గ్యాంగ్ లీడర్తో ఆగలేదు. గ్యాంగ్ లీడర్లో వదిన పాత్రలో నటించిన సుధ, తర్వాతి చిత్రం రౌడీ అల్లుడులో ఆయనకు అక్కగా నటించారు. ఆ తర్వాత ఆయనకు అత్తగా కూడా పాత్రలు పోషించారు. తన పాత్రల ప్రమోషన్ ఇలా సాగిందని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. నటుడు ఆలీ ఒకసారి తనను ఆటపట్టిస్తూ, పదేళ్లు ముందు పుట్టి ఉంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి అమ్మగా చేసేవాళ్ళేమో అని అన్నారని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Eknath Harika : భర్తతో కలిసి కొత్తింట్లోకి సీరియల్ బ్యూటీ.. నూతన గృహప్రవేశం చేసిన హారిక.. ఫోటోస్ వైరల్..
చిరంజీవి ..

Chiranjeevi
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‌లోకి సీరియల్ బ్యూటీ.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ మళ్లీ వచ్చేస్తుంది.. ఇక ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..
