Uday Kiran : ఉదయ్ కిరణ్ ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. టాలీవుడ్ నటి..

ఉదయ్ కిరణ్.. ఈ పేరు చెబితే తెలుగు ప్రేక్షకుల కళ్లు చెమ్మగిల్లుతాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సాధారణ కుర్రాడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి హ్యాట్రిక్స్ హిట్లతో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ సినిమాలు వరుసగా ప్లాప్ కావడం.. పర్సనల్ విషయాల ఒత్తిడితో సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు.

Uday Kiran : ఉదయ్ కిరణ్ ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. టాలీవుడ్ నటి..
Uday Kiran

Updated on: Feb 24, 2026 | 7:20 AM

టాలీవుడ్ నటి సుధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. వివైధ్యమైన పాత్రలతో సినీప్రియులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో నటి సుధ మాట్లాడుతూ తనతో హీరో ఉదయ్ కిరణ్ కు ఉన్న అనుబంధం గురించి వెల్లడించింది. దివంగత నటుడు ఉదయ్ కిరణ్ దత్తత తీసుకోవాలని అనుకున్నానని అన్నారు. గతం ఒక కరిగిపోయే మేఘం వంటిదని, వాటిని అనుభవాలుగా తీసుకుని ధైర్యంగా ముందుకు సాగుతున్నానని ఆమె అన్నారు. కళాకారులు ఎదుగుతున్నప్పుడు కొందరు వారి శ్రమని దుర్వినియోగం చేస్తుంటారని, అలాంటి పరిస్థితి తనకూ ఎదురైందని సుధ తెలిపారు. సుధ తన జీవితంలో డబ్బు కంటే మానవ సంబంధాలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

“డబ్బు ఏముందండి మనం పోయిన తర్వాత డబ్బుతో పాటు మనం వెళ్లట్లేదు. నేను సంపాదించుకునేది మనుషులను సంపాదించుకున్నాను” అని ఆమె చెప్పారు. రక్త సంబంధీకులు కష్టకాలంలో దూరం జరిగినా, తనతో కలిసి పనిచేసేవారే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల వంటివారని, తన మంచి చెడులను చూసేవారే నిజమైన బంధువులని తన తల్లి చెప్పిన మాటలను సుధ గుర్తుచేసుకున్నారు. దివంగత నటుడు ఉదయ్ కిరణ్‌ను దత్తత తీసుకోవాలని అనుకున్నారట. ఉదయ్ కిరణ్ తల్లిని కోల్పోవడం, తండ్రి దూరం కావడం, వైవాహిక జీవితంలో సమస్యలు వంటి అనేక ఒంటరి పరిస్థితులలో ఉన్నాడని, అది తనను తీవ్రంగా కలచివేసిందని సుధ అన్నారు. తన తల్లిని కోల్పోయి, కొన్ని విషయాలను పోగొట్టుకున్న తన జీవితానుభవాలకు, ఉదయ్ కిరణ్ పరిస్థితికి మధ్య పోలికలు ఉన్నాయని..”దేవుడు నాకు ఇచ్చిన బిడ్డేమో” అని అనిపించి, అతన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నానని సుధ తెలిపారు. దత్తత ప్రక్రియ కోసం లాయర్ ద్వారా పేపర్లను సబ్మిట్ చేశామని, అఫిడవిట్ కూడా ఇచ్చామని, మరో మూడు, నాలుగు నెలల్లో కోర్టు నుండి ఆర్డర్ వస్తే దత్తత పూర్తవుతుందని ఆశించామని ఆమె వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

అయితే, దత్తత ప్రక్రియ పూర్తి కాకముందే ఉదయ్ కిరణ్ తనతో, తన కూతురితో, తన హెయిర్ స్టైలిస్ట్‌తో సహా అందరితోనూ సంబంధాలు తెంచుకున్నాడని సుధ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయ్ కిరణ్ పెళ్లి గురించి తనకు ఎవరూ చెప్పలేదని, ఆ పెళ్లికి కూడా తాను వెళ్ళలేదని, మనసు బాధపడిందని ఆమె తెలిపారు. ఉదయ్ కిరణ్ విషయంలో తనకు ఎటువంటి కోపం లేదని, కేవలం అతడిని తన కొడుకుగా భావించి అతడికి అండగా ఉండాలనుకున్నానని సుధ స్పష్టం చేశారు. ఉదయ్ కిరణ్ మెంటాలిటీ, తన మెంటాలిటీ, సాఫ్ట్‌నెస్, మాటల తీరు చాలావరకు ఒకేలా ఉండేవని ఆమె గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

Follow Us