Actress Snigdha: ‘ఏటా శివ మాల వేసుకుంటా.. పిరియడ్స్ రాకుండా ఉండేందుకు’.. నటి స్నిగ్ద ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అలా మొదలైంది సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది నటి స్నిగ్ద. అందులో నాని ఫ్రెండ్ గా నటించి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. చూసేందుకు మగరాయుడిలా కనిపించే ఈ నటి తాజాగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

న్యాచురల్ స్టార్ నాని నటించిన అలా మొదలైంది సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది నటి స్నిగ్ద నయని. మొదట సింగర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత నటిగా స్థిర పడిపోయింది. అలా మొదలైంది, మేం వయసుకు వచ్చాం, రొటీన్ లవ్ స్టోరీ, దమ్ము, ప్రేమ ఇష్క్ కాదల్, అంతకు ముందు ఆ తర్వాత, గుంటూర్ టాకీస్, కల్యాణ వైభోగమే, సెల్ఫీ రాజా, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, పీఎస్వీ గరుడ వేగ, ఓ బేబీ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. చూడ్డానికి మగరాయుడిలా కనిపించే స్నిగ్ద చాలా డేరింగ్. ఏ విషయమైనా మొహమాటం లేకుండా మాట్లాడుతుంది. అలా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన స్నిగ్ద తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా తాను పెళ్లే చేసుకోనంటూ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చిందీ అందాల తార.
సినిమాల్లో బిజీగా ఉండే స్నిగ్ద ఇటీవల శివమాలలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే విషయంపై లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ‘నేను శివుడిని బాగా ఆరాధిస్తాను. ప్రతీ సంవత్సరం శివమాల కూడా ధరిస్తాను. మాల వేసుకున్నప్పుడు ఎంతో నిష్టగా ఉంటాను. అలాగే కొన్ని మందులు వాడి పీరియడ్స్ ని ఆపుకొంటాను. నిజం చెప్పాలంటే నాకు థైరాయిడ్ సమస్య ఉంది. అలాగే పీసీఓడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) కూడా ఉంది. అందుకే నాకు ప్రతి మూడు నెలలకు లేదా నాలుగు నెలలకు ఒకసారి మాత్రమే పిరియడ్ వస్తుంది’ అంటూ ధైర్యంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం స్నిగ్ద కామెంట్స్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి.
నటి స్నిగ్ద లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
కాగా ప్రస్తుతం స్నిగ్ధ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.. కానీ సింగర్‌గా పలు షోలు చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలతో పాటు తన ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేసుకుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంటుంది.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








